తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: మంత్రి జగదీష్ రెడ్డి
- దేశానికి తీరని లోటు
- రాష్ట్ర ఏర్పాటు కమిటీకి ప్రణబ్ ముఖర్జీ చైర్మన్
- రాష్ట్రపతి హోదలోనే తెలంగాణ బిల్లు ఆమోదం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం:
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం ప్రకటించారు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీ సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కమిటీకి ప్రణబ్ ముఖర్జీ చైర్మన్ గా ఉన్నారన్నారు. రాష్ట్రపతి హోదా లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదానికి రాజ ముద్ర వేసిన గొప్ప నాయకులు భారత రత్న ప్రణబ్ ముఖర్జీ. వారి మరణం పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర సంతాపం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం బిల్లు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని మంత్రి గుర్తు చేసుకున్నారు. మహానేత మరణంతో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.