వాకర్ ప్యారడైజ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం లకారంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్ ప్యారడైజ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మహాత్మా గాంధీజీ జయంతి నాడు మినీ లకారం ట్యాంక్ బండ్ నందు వాకర్స్ ప్యారడైజ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరానికి మరో మణిహరంగా నిలిచి నగర ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచుతుందని పేర్కొన్నారు.
రూ.2 కోట్ల వ్యయంతో పార్క్ అదునికరించి వాకింగ్, జాగింగ్, యోగ, ఓపెన్ జిమ్, గ్రీనరి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక సదుపాయాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా బల్క చెత్తను సేకరించెందుకు "Waste on wheels" కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.
అనంతరం ఉత్తమ శానిటరీ వర్కర్స్ కి ప్రశంసా పత్రాలు, టోపి(Cap)ను అందజేశారు. జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.
మహాత్మా గాంధీజీకి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు:అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ వారికి పశ్చిమాన్ని చూపించిన మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీజీ 151వ జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలు ముగిసి 151వ జయంతి నేడు జరుపుకుంటున్న సందర్భంగా ఖమ్మం నగరం గాంధీ చౌక్ సెంటర్ లో గల గాంధీజీ ఘాట్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన చూపిన గాంధీమార్గమే నేటికి అందరికీ అనుసరణీయమని అన్నారు. పల్లే సీమలే దేశానికి పట్టు కొమ్మలన్న గాంధీజీ బాటలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ పయనిస్తున్నారని, గ్రామాల స్వయం సమృద్ధి, పల్లె ప్రగతి కోసం పాటుపడుతున్నారని తెలిపారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే...ఆయన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసిఆర్ అని అన్నారు. భరతమాత తల రాతను మార్చి, తరతరాల యమ యాతను తీర్చిన విధాత గాంధీజి అయితే తెలంగాణ తల్లి తలరాతను మార్చి.. ఆత్మగౌరవ ప్రతీకను ఎగురవేసిన ఉద్యమ నేత సిఎం కేసిఆర్ అని అన్నారు. గాంధీజి సూచించిన మార్గాల్లోనే పయనించి ఈ రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఫిట్ ఇండియా - ఫిట్ తెలంగాణ ప్రీడమ్ రన్ లో పాల్గొన్న మంత్రి:
డా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్ ఇండియా - ఫిట్ తెలంగాణ ప్రీడమ్ రన్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. శుక్రవారం లకారం మినీ ట్యాంక్ బండ్ వద్ద క్రీడా జ్యోతి వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మహాత్మా గాంధీజీ జయంతి రోజు ఫిట్ ఇండియా రన్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా క్రీడా శాఖ అధ్యర్యంలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా “ఫిట్ ఇండియా - ఫిట్ తెలంగాణ “ ప్రీడమ్ రన్ ను నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజలు, క్రీడకారులు రోజు వారి జీవితంలో శారీరక శ్రమలు మరియు క్రీడలు భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలు, క్రీడాకారులు ఫిట్ గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైందన్నారు. ప్రస్తుతం పరిస్థితులలో ప్రతి ఒక్కరూ శారీరకంగా, ఆరోగ్యంగా ఉండటానకి తప్పనిసరిగా వాకింగ్, వీలైతే కోద్దిదూరం పరుగేత్తడం వల్లన రోగ నిరోదక శక్తిని పెంచుకోవటానికి ఈ ఫిట్ తెలంగాణ ఫ్రీడమ్ రన్ ను ప్రజల అవగాహన కోసం నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఫిట్ తెలంగాణ ఫ్రీడమ్ రన్ లో పాల్గోనే వారందరు ప్రస్తుత కోవిడ్ నిబందనలకు అనుగుణంగా సామాజిక దూరంను పాటిస్తూ ఈ రన్ నిర్వహించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు క్రీడల ప్రోత్సాహనికి ప్రభుత్వం పేద్దపీఠ వేసిందన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించటానికి ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లును అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా పాలసీని ప్రకటించారని, తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా తీర్చిదిద్దబోతున్నామన్నారు.