రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలి: మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: గంగుల కమలాకర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ & పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ రోజు హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో వానకాలం 2020-21 సం.కి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మరియు సంస్థ అధికారులు, రాష్ట్ర రైసుమిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి మరియు జిల్లా స్థాయి రైసు మిల్లర్ల అసోసియేషన్ నిర్వహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వానకాలం వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి కోరారు.
- రాష్ట్రంలో సుమారు 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వానకాలం వరిధాన్యం సేకరించడానికి అంత సిద్దం. ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.
- వానకాలం 2020-21 వరి సాగు విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలు (సన్న ధాన్యాలు 34.45 లక్షల ఎకరాలు మరియు దొడ్డు ధాన్యం 13.33 లక్షల ఎకరాలు) సాగుచేయడం జరిగినది.
- ఈ సీజన్లో సన్న రకాలు 98.61 LMTs మరియు దొడ్డు రకాలు 33.33 LMTs మొత్తంగా 131.94 LMTs ధాన్యం ఉత్పత్తి అంచనా వేయడమైనది.
- ఇందులో నికరంగా కొనుగోలు కేంద్రాలకు 75 LMTs వస్తుందని, దీనిని పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేయడానికి నిర్ణయించడమైనది.
- ఇందుకు గాను కొత్తవి 10.13 కోట్లు, పాతవి 8.63 కోట్లు మొత్తంగా 18.76 కోట్ల అవసరమగు గోనే సంచులు సమకూర్చుకోవాలని నిర్ణయించడమైనది.
- గోనే సంచుల సమస్య ఉత్పన్నం కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ సరిపడ కొత్త గోనే సంచులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
- కొనుగోలు ప్రక్రియ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సాఫ్ట్ వేర్ ను సిద్దం చేసుకోవాలని సూచించారు.
- కొనుగోలు కేంద్రలాలో ధాన్యం అమ్మిన రైతులకు త్వరగా డబ్బులు అందేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.
- కొనుగోలుకు అవసరమైన తగు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.
- కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించుటకొరకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగినది.
- ఇందుకు అవసరమగు నిధులు మరియు రవాణ మరియు ఇతర సమస్యలు ఉత్పన్నమైనచో తక్షణమే స్పందించుటకై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమైనది.
- ఈ సీజన్ లో రాష్ర్ట ప్రభుత్వం కొనుగోలు చేయదలచిన వరి ధాన్యమును రైసు మిల్లర్లు దిగుమతి చేసుకొనె విషయంపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికై వివిధ జిల్లాల రైస్ మిల్లర్లతో చర్చించడం జరిగింది.
- సందర్భంగా రైస్ మిల్లర్లు తమకు సంబంధించిన సమస్యలపై మంత్రితో చర్చించడమైనది. ప్రభుత్వం మిల్లర్ల సమస్యలను పరిష్కరించుటకు సానుకూలంగా ఉన్నది. దీనికి గాను గౌరవ మంత్రివర్యులు రైస్ మిల్లర్లు విన్నవించిన ప్రతి యొక్క సమస్యను క్షుణంగా చర్చించి వారి యొక్క న్యాయమైన సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరింప జేస్తానని రైస్ మిల్లర్లకు తెలిపారు.