ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం రైతు సంక్షేమం కొరకే: మంత్రి జగదీష్ రెడ్డి
- దరణియే శ్రీరామరక్ష
- రైతాంగం మేలు కోరే
- పట్టా మార్పిడి ఎవరితో సాధ్యపడదు
- యావత్ భారత దేశంలోనే ప్రప్రథమం
- ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని తెలంగాణ రైతాంగం గుర్తించాలి
- సూర్యాపేట మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం
మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఉప్పల లలితా ఆనంద్, వైస్ చైర్మన్ ముద్దం క్రిష్ణారెడ్డి ఇతర పాలక వర్గ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, డిసియంయస్ చైర్మన్ వట్టి జానయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పి వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, యంపిపి లు నెమ్మది బిక్షం, రవీందర్ రెడ్డి, కుమారి బాబు, మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి, జడ్పిటిసి లు జీడీ బిక్షం, సంజీవ్ నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, కార్యదర్శి వైవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక తెలంగాణ రైతాంగం సంక్షేమం ఉంటుందని, ధరణి ఫోర్టల్ అందులో భాగమేనని ఆయన చెప్పుకొచ్చారు. రుణమాఫీ మొదలుకొని రైతుబందు, రైతుభీమా , రైతు వేదికల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలు రైతాంగానికి ప్రయోజనకరంగా ఉండాలని మొదలుపెట్టినవేనని ఆయన అన్నారు.
ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 65 శాతానికి పైచిలుకు కేటాయింపులు వ్యవసాయనికే అన్నది తెలంగాణ రైతాంగం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా ఋణమాఫీ, రైతుబందు, రైతుభీమా, రైతు వేదికల నిర్మాణాలు అయితే పరోక్షంగా 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాల వంటి నీటి పారుదల రంగానికి బడ్జెట్ లో కేటాయంపులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆ క్రమంలోనే మొదలు పెట్టిన ధరణి ఫోర్టల్ కు ఎంత ఖర్చు అయినా సరే వెనకకు పోకుండా ఎవరి భూములకు వారినే హాక్కుదారులుగా నిర్ణయించేందుకే ప్రభుత్వం సొంత ఖర్చుతో భూసర్వే చేపట్టిందన్నారు. ఎవరి భూములు వారు పట్టా చేసుకోవాలంటే పడిన తిప్పలు, వారసత్వంగా వచ్చిన భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కలిగే ఇబ్బందులతో పాటు ఒకరి భూములు మరొకరి పేరు మీద సృష్టించిన పత్రాలతో రైతాంగం ఇంతకాలం ఎంతటి ఘోష అనుభవించిందో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు అన్నారు.
అందుకే ఎప్పుడో నిజాం పాలనలో జరిపిన సర్వేను అధ్యయనం చేసిన మీదట ధరణి ఫోర్టల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ధరణి ఫోర్టల్ తో పట్టాల మార్పిడికి ఆస్కారం లేకుండా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ సమాజం ఎంతగానో రుణపడి ఉందన్నారు.
అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంఘటితం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి విజ్ణప్తి చేశారు.