గురువారం మరో 24 బస్తీ దవాఖానలను ప్రారంభించనున్న మంత్రులు, మేయర్
హైదరాబాద్, నవంబర్ 11: గ్రేటర్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్య పరీక్షలు అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానలను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. వీటికి తోడు మరో 24 బస్తీ దవాఖానలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం నాడు ప్రారంభించనున్నారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో "బస్తీ దవాఖాన'' లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది.
నగరంలో నిర్వహిస్తున్న ఈ 200 బస్తీ దవాఖానలు నిరుపేదలకు బస్తీవాసులకు మెరుగైన వైద్య పరీక్షలను అందజేస్తున్నందున మరో 24 బస్తీ దవాఖానలను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహ్మూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మారావు, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ లు వివిధ ప్రాంతాల్లో ప్రారంభిస్తారని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సంబంధిత పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొంటారని మేయర్ రామ్మోహన్ తెలిపారు.
ప్రారంభం కానున్న బస్తీ దవాఖానల జాబితా: