వందశాతం బహిరంగ మల విసర్జన రహిత హోదాను సాధించిన ముఖ్రా కె గ్రామం
తెలంగాణలోనే నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత (Open Defecation Free (ODF) status) హోదాను సాధించిన ఏకైక గ్రామ పంచాయతిగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా కె గ్రామాన్ని కేంద్ర జలవనరుల శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ తదితర ప్రజా ప్రతినిధులు ప్రగతి భవన్ లో కలిశారు. ముఖ్రా కె గ్రామం ODF plus గ్రామంగా ఎంపిక అవ్వడం మన తెలంగాణకే గర్వకారణం అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
‘‘నేను కన్న కలలు మీ గ్రామం ద్వారా నిజమవుతున్నాయి‘‘ అని ముఖ్రా కె సర్పంచ్ గాడ్గె మినాక్షిని, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. గ్రామంలో 100% మొక్కలు బ్రతకడం చాలా ఆనందమని, సేంద్రీయ ఎరువులు తయారుచెస్తున్న తొలి గ్రామం ముఖ్రా కె కావడం అభినందినయం అని, ప్రతి పల్లె ముఖ్రా కె లాగా తయారు అవ్వాలని సీఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.