ఫారెస్ట్ కాలేజీని యూనివర్సిటీగా మార్చేందుకు, విద్యార్థులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు కృషి: మంత్రి హరీష్ రావు

Related image

  • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ని నెలకొల్పాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • కన్నుల పండగగా ఫారెస్ట్ కాలేజీ, బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ స్నాతకోత్సవం
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు
సిద్దిపేట: ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం, ప్రకృతి రక్షణ పట్ల సృహ ఇప్పుడు వస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఆ విషయంలో ముందే మేల్కొందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రాష్ట్రం సిద్దించిన తొలినాళ్లలోనే ముందు చూపుతో ఫారెస్ట్ కాలేజీకి బీజం వేశారని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ ఇప్పుడు మన ముందు ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

ఫారెస్ట్ కాలేజీ, రీసెర్ట్ ఇనిస్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ పూర్తి చేసిన బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. యాభై మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయటంతో పాటు, వివిధ సబ్జెక్టుల్లో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను మంత్రులు అందించారు.

సుమారు మూడున్నర గంటల పాటు సిద్దిపేట జిల్లా ములుగు కాలేజీ క్యాంపస్ లో ఈ కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు, వారి తల్లితండ్రులు, కాలేజీ ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్ట్ కాలేజీ వాతావరణం చూస్తుంటే ఏ అంతర్జాతీయ కాలేజీ ప్రమాణాలకు తక్కువ లేదని, యూనివర్సిటీగా మార్చే ప్రతిపాదనతో పాటు, ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని, ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన, మొదటి బ్యాచ్ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఫారెస్ట్ కాలేజీ గవర్నింగ్ బాడీ చైర్మన్ ఏ.శాంత కుమారి ఆకాక్షించారు. ఈ ఫారెస్ట్ కాలేజీ నుంచి అఖిల భారత సర్వీసు అధికారులు రావాలనే సీఎం ఆకాంక్షను విద్యార్థులు నెరవేర్చాలని అకడమిక్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.శోభ కోరారు. ఫారెస్టీ కాలేజీ డీన్ చంద్రశేఖర రెడ్డి కార్యక్రమ నిర్వహణ చేశారు.

కార్యక్రమంలో అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవీశాఖ), చైర్మన్ ఫారెస్ట్ కాలేజీ గవర్నింగ్ బాడీ ఏ.శాంతి కుమారి, చైర్మన్ అకడమిక్ కౌన్సిల్ (పీసీసీఎఫ్) ఆర్.శోభ, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సీహెచ్. గోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.దోబ్రియల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

More Press Releases