నెహ్రూ జూలాజికల్ పార్క్ కు ఐఎస్ఓ సర్టిఫికేషన్
- నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ కు I.S.O 9001:2015 Quality Management Standards Certificate ప్రదానం
- అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకు ప్రదానం
- దేశంలో నాణ్యతా ప్రమాణాల సర్టిఫికేస్ అందుకున్న మొదటి జూ
- అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అందజేత
ముఖ్యంగా శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ బ్రీడింగ్, జూ హాస్పిటల్, యానిమల్ కేర్, హైజీన్ Maintenance, ఎస్టాబ్లిషమెంట్ లను ఈ క్రింది నిపుణుల బృందం తనిఖీ చేసింది.
1. T. Sundaramaiah, (Retd District Judge)
2. C. Madhu Babu, Auditor
3. Shivaiah Alapati, Certificate Auditor
ఈ బృందం అన్ని విషయాలతో పాటు, వివిధ విభాగాల్లో పాటిస్తున్న ప్రమాణాలను కూడా పరిశీలించింది. జూ సిబ్బంది సమర్థవంతంగా, అంకితభావంతో పని చేయటం, జంతువుల పట్ల మానవతా దృక్పధంతో సేవలందించుట నిపుణులకు బాగా నచ్చిన విషయాలు.
రిటైర్డ్ జడ్జి సుందరామయ్య ముఖ్యంగా జూలోని అధికారుల యొక్క మార్గదర్శనం వారి నాయకత్వంని ప్రశంసించటం జరిగింది.
ప్రతి పనిలో పారదర్శకత, 24 గంటల అన్ని అత్యవసర పరిస్థితులలో సిబ్బంది స్పందించే విధానం గొప్పగా ఉందని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఈ సమాచారాన్ని, గణాంకాలను U.K Accreditation వారికి పంపించి, నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈ ISO 9001:2015 Certificate పొందటానికి చాలా ఖచ్చితమైన సిఫార్సు పంపటం జరిగింది.
యూకే (U.K) అక్రిడియేషన్ కమిటీ ఇవన్నీ పరిశీలించి, ముఖ్యంగా జూ సందర్శకుల సంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకుని సర్టిఫికేషన్ ప్రదానం కోసం అప్రూవల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో 24 గంటలు పని చేసిన సిబ్బంది యొక్క నిబద్ధత, పాటించిన శుభ్రతా చర్యలు చాలా హర్షణీయమని కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, ISO Certification పొందిన మొట్ట మొదటి జూ దేశంలోనే నెహ్రూ జూలాజికల్ పార్క్ కావటం గర్వకారణం అన్నారు.
సర్టిఫికేషన్ ప్రదాన కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జూ డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటీ, జూ క్యూరేటర్ ఎన్.క్షితిజ, డిప్యూటీ డైరెక్టర్ వెటర్నిటీ డాక్టర్ ఎం.ఏ. హకీమ్, సర్టిఫైడ్ ఆడిటర్ HYM ఇంటర్నేషనల్ శివయ్య ఆలపాటి పాల్గొన్నారు.