మూడేళ్ల బాలుడి మూత్రసంచి నుంచి 3సెం.మీ రాయి తొలగించిన కిమ్స్ సవీర వైద్యులు
- ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స
- కోత లేకుండా లేజర్ ద్వారా శస్త్రచికిత్స
- అనంతపురం పట్టణంలో మొదటి అరుదైన శస్త్రచికిత్స
ఈ శస్త్రచికిత్స గురించి డాక్టర్ దుర్గప్రసాద్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో మూత్రసంచిలో రాళ్లు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయన్నారు. చిన్నపిల్లలలో మూత్రసంచిలో రాళ్లు రావడానికి మాల్న్యూట్రేషన్ ప్రధానం కారణం. ఈ రాళ్లు రావడం వల్ల పెద్దవారే చాలా ఇబ్బంది పడుతారని అన్నారు. అలాంటిది చిన్నపిల్లల్లో మూత్ర సమస్యతో పాటు ఇతర ఇబ్బందులు పడుతారని తెలిపారు. వయసులో పరిమితికి మించిన రాయి బాలుడి మూత్రసంచిలో చేరిన విషయాన్ని పరీక్షలు చేసి గుర్తించామన్నారు.
చిన్న పిల్లల అనస్థీషియా వైద్యుడి సహాకారంతో దాదాపు గంటన్నరు పైగా కోత లేకుండా లేజర్ సిస్టోలితోత్రిప్సీ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా 3సెంటి మీటర్ల గల రాయిని తొలిగించామన్నారు. ఇటువంటి చికిత్సల కోసం గతంలో బెంగుళూరు, హైదరాబాద్ పట్టాణాలకు వెళ్లే వారని.. అత్యంత అధునిక సదుపాయులు ఉన్న కిమ్స్ సవీరలో మూడేళ్ల బాలుడుకి ఇలాంటి శస్త్ర చికిత్స చేయడం అనంతపురం పట్టణంలో మొదటిసారని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడమని తెలిపారు.
తగిన పోషకాహార, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిత్యం నీళ్లు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.