తమిళనాడు, కర్ణాటకలోని ఆశ్రమాలను సందర్శించిన ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- రాజకీయ పార్టీల ప్రమేయంతోనే ఆలయాలపై దాడులు
- స్వామీజీలకు వివరించిన మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే విష్ణు
- రాష్ట్రాభివృద్ధికి అండగా ఉండాలని ఉడిపి శ్రీకృష్ణుని, మైసూరులోని చాముండేశ్వరీ మాతకు మంత్రి వెల్లంపల్లి, ఎమ్మేల్యే ప్రత్యేక పూజలు
- తమిళనాడు, కర్ణాటకలోని ఆశ్రమాలను సందర్శించిన దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు
పుష్పగిరి మహా సంస్థాన పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతీ స్వామిజీ వారు లోక కళ్యాణార్థం సంకల్పించిన యాత్రలో భాగంగా ఇంద్రకీలాద్రికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని ధార్మిక కార్యక్రమాలకు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విద్యాశంకర భారతీ స్వామి తెలిపారని అన్నారు. ఇటివల దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి, రాజకీయ పార్టీల ప్రమేయంపై పోలీసుల దర్వాప్తులో తెలిందన్నారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్టప్రచారం తొలగాలని ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలోని స్వామీజిలకు వివరించడం జరిగిందన్నారు.
తమిళనాడు కంచి కామకోటి పీఠం, కుర్తాళం పీఠాధిపతులకు మంత్రి బెజవాడ కనకదుర్గమ్మవారి ప్రసాదం అందించి, ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం శక్తి పీఠాధీశ్వరి, మాతాజీ రమ్యానందభారతీ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన యజ్ఞంలో మంత్రి పాల్గొన్నారు.
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి దేవాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంగళవారం సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారిరువురూ గణపతి సచ్చిదానందస్వామి ఆశీర్వచనం అందుకున్నారు. మైసూరులోని అవధూత గణపతి సచ్చిదానంద స్వామిని కలిసి మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆశీర్వచనం అందుకున్నారు. అదే విధంగా శ్రీ విశ్వప్రసన్న తీర్ధ శ్రీపాద స్వామిని కలిసి ఆశీర్వచనం అందుకున్నారు. 12వ శతాబ్దంలోని కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో మధ్వాచార్యుల వారు స్థాపించిన 'పెజావర్ మఠం' 32వ మఠాథిపతులైన శ్రీ 'విశ్వప్రసన్న తీర్ధ శ్రీపాద' వారిని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి స్వామివారి ఆశీర్వచనం అందుకున్నారు.
ఉడిపి కృష్ణుడు, శారదాంబ అమ్మవార్ల సేవలో మంత్రి, ఎమ్మెల్యే
కర్ణాటక రాష్ట్రం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన శృంగేరి శారదా పీఠాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం శారదా పీఠంలోని శారదాంబ అమ్మవారిని వారు ఇరువురూ దర్శించుకున్నారు. అదేవిధంగా కర్ణాటకలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన కృష్ణుని ఆలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.