రెండు కోట్లు రూపాయలతో ఇండోర్ స్టేడియం: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- 46 డివిజన్లో రూ.90 లక్షలతో స్విమ్మింగ్ పూల్ అభివృద్ధికి శంకుస్ధాపన
- కె. ఎల్.రావు వి.ఎం.సి పార్కులో వాకింగ్ ట్రాక్
సొమవారం 46వ డివిజనులోని డాక్టర్ కె.ఎల్ రావు వి.ఎం.సి పార్కులో రూ.90లక్షలతో స్విమ్మింగ్ పూల్ అభివృద్ధికి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికులతో మాట్లాడారు. పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కెఎల్ రావు వి.ఎం.సి పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటుగా రెండు కోట్లు రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అంచనాలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులతో పాటు పార్టీ శ్రేణులు ఉన్నారు.
వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ, అవినీష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదీనా మసీద్ కు ఆర్థిక సాయం అందించిన మంత్రి కుమార్తె వెల్లంపల్లి సాయి అశ్విత:
పశ్చిమ నియోజకవర్గం రాజరాజేశ్వరీపేటలో మదీనా మసీద్ నిర్మాణానికి వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ, అవినీష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయంను మంత్రి కుమార్తె వెల్లంపల్లి సాయి అశ్విత మదీనా మసీద్ కమిటీ నిర్వహకులకు సొమవారం అందజేశారు.
ఇటివల దేవదాయ శాఖ మంత్రి పర్యటనలో భాగంగా నిధులు లేక మదీనా మసీద్ నిర్మాణం సగం నిల్చిన విషయం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి నిర్మాణానికి రెండు లక్షల రూపాయలను వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ, అవినీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంత్రి కుమార్తె వెల్లంపల్లి సాయి అశ్విత ఈ రోజు మసీద్ కమిటీ నిర్వహకులకు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ నిర్వహకులు షబ్బార్ సాబ్, ఎండి రబ్బాని, వాహిద్ ఖాన్ మరియు వైసీపీ శ్రేణులు తదితరులు ఉన్నారు.