టీ-శాట్ ఆధ్వర్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలకు మాక్ టెస్ట్

Related image

(టీ-శాట్-సాఫ్ట్ నెట్): అనేక పోటీ పరీక్షలకు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సంపాదించడంలో తోడ్పాటు నందించిన టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్లు మరో చేయూతకు సిద్దమయ్యాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్ధులకు టీ-శాట్ ఉచిత మాక్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ మేరకు టీ-శాట్ సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షరాసే విధానంలో మాక్ టెస్టును అందుబాటులోకి తెచ్చింది. టీ-శాట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డు గ్రాడ్యుయేట్ లెవెల్, కంబైన్డు సెకండరీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోటీ పరీక్షలు రాస్తున్న ఉద్యోగులు మాక్ టెస్టును రాసి తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకునే వీలును టీ-శాట్ కల్పించింది’. అని శైలేష్ రెడ్డి వివరించారు.

ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో మే నెలలో జరగనున్న సీజీఎల్, సీహెచ్ఎల్ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ప్రోత్సహించేందుకు ఈ మాక్ టెస్టు ప్రీ ఫైనల్ టెస్టులా ఉపయోగపడనుందన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీ-శాట్ నెట్ వర్క్ వెబ్ సైట్ www.tsat.tv లో పాల్గొనాల్సి ఉంటుందని సీఈవో స్పష్టం చేశారు.

ఒక గంట సమయం కలిగిన ఈ పరీక్షలో 100 ప్రశ్నలు, 200 మార్కుల పేపర్ లో తప్పుడు సమాధానానికి 0.5 నెగెటివ్ మార్కు ఉంటుందన్నారు. గంట సమయం పూర్తవగానే అభ్యర్థి రాసిన ప్రశ్నలకు మార్కులు కాకుండా స్కోర్ రూపంలో ఫలితం వస్తుందన్నారు. మాక్ టెస్టులో జనరల్ ఇంటిలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ అవేర్ నెస్ సబ్జెక్టులపై ఉండే పరీక్షల్లో అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాతినిద్యాన్ని పెంచాలని సీఈవో శైలేష్ రెడ్డి కోరారు.

More Press Releases