43వ జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో మార్చ్ 31 నుండి ఏప్రిల్ 4వ తేది వరకు సరూర్ నగర్ స్టేడియంలో జరుగనున్న 43వ జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ బ్రోచర్ ను జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో కలసి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా రూపోందుతుందన్నారు. అందులో భాగంగా క్రీడల అభివృద్దికి, మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రులతో క్యాబినేట్ సబ్ కమీటి నియమించారన్నారు. గ్రామీణ క్రీడా కారులను తీర్చిదిద్దుతున్నామన్నారు. క్రీడా పాలసీలో భాగంగా రాష్ట్రంలో క్రీడల ఆభివృద్దికి అత్యుత్తమ పాలసీని ప్రకటించబోతున్నామన్నారు.
దేశంలో అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాలను కలిగివున్న నగరం హైదరాబాద్ నగరమన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగాా తీర్చిదిద్ధేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రణాళికలను రూపోందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడాకారులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలను సాధించిన క్రీడాకారులకు సీఎం కేసీఆర్ నగదు పురస్కారాలను అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హ్యాండ్ బాల్ క్రీడ అభివృద్దికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరుకు పేద్దపీట వేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో క్రీడల అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. హ్యాండ్ బాల్ క్రీడ అభివృద్దికి హైదరాబాద్ నగరానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. గతంలో జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో హైదరాబాద్ కు చెందిన ఎంతో మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారన్నారు. 43వ జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ నిర్వాహణకు తెలంగాణ ప్రభుత్వం, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్, హైదరాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ రెడ్డి, సీనియర్ కోచ్ రవి, జగన్ మోహన్ గౌడ్, దీపక్, శివ కుమార్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.