'అష్టోత్తర శత భాగవత పారాయణ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి
- లోక కల్యాణార్థం ‘అష్టోత్తర శత భాగవత పారాయణ’ కార్యక్రమం ఒక అపూర్వ ఘట్టం
- మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, రాపాక
ఈ సందర్భంగా మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావులు మాట్లాడుతూ విజయవాడ నగర చరిత్రలోనే ఇదొక అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. భాగవతం చదువుతుంటే ఎవరిలోనైనా భక్తిభావం ఉప్పొంగుతుందన్నారు. భాగవతాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రతిఒక్కరూ చదవడమే కాకుండా ఆచరించాలన్నాను. అదేసమయంలో సంస్కృతి సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలు, వేదాలు, ధర్మాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యతక ఉందన్నారు. అప్పుడే సమాజం సుఖ:సంతోషాలతో ప్రణవిల్లుతుందన్నారు. మానవ జీవిత తొలిదశ నుంచి ప్రతిఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావనను పెంపొందించే విధంగా మాగంటి సుబ్రహ్మణ్యంతో సహా కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అభినందనీయమన్నారు.
భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలపై మరింత విస్తృత ప్రచారం నిర్వహించి భాగవత పద్యాలలోని విలువలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. అనంతరం వేదపండితులు ముఖ్య అతిథులకి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. శ్రీ కృష్ణాష్టోత్తర శత నామావళి కార్యక్రమం ఈ నెల 31 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఐ.మురళీధర్ శర్మ, నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్, రామకృష్ణ, రాపాక వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పణుకు శేషగిరిరావు(శేషు)కి నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి :
అందరికి సేవ చేయాలనే తపనతో బతికిన కార్మిక నాయకుడు పణుకు శేషగిరిరావు(శేషు)అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు.
బుధవారం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం మాజీ అధ్యక్షుడు కీ౹౹శే పణుకు శేషగిరిరావు(శేషు) ప్రధమ వర్ధంతి కార్యక్రమం మిల్క్ ప్రాజెక్టు వద్ద నున్న కల్యాణమండపం నందు మొదటి సంస్కరణ సభకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి శేషు, సొదరి చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు.. అనంతరం జరిగిన సంస్కరణ సభలో మాట్లాడుతూ వారు కార్మికుల కోసం చేసిన ఉద్యమాలను వారితో ఉన్న అనుభంధం గుర్తు చేస్తుకున్నారు..కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబూజి(బాబ్జి), పణుకు శేషు సతీమణి మీనాక్షి, కుమారులు రమేష్, రాజేష్, అల్లుడు నరేష్, సోదరుడు చెన్నకేశవరావు, కార్పరేటర్ అతులూరి ఆదిలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.