తప్పనిసరి అయితేనే బయటికి రండి.. ఇంట్లో కూడా మాస్క్ వాడాలి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- స్వీయ నియంత్రణ,మాస్కు దరించడమే శ్రీరామ రక్ష
- మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
- ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది.. ప్రజల సహకారం అవసరం
సమావేశంలోని పలు నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.
- కోవిడ్ రెండవ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించాం.
- జిల్లాలో అధిక సంఖ్యలో కొవిడ్ పరీక్షలు చేయడం, పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం అందించడం, కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయడం. ఈ 4 అంశాలు సమాంతరంగా అమలయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం.
- జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలలో ప్రతి రోజు 3,000 వరకు కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
- పరీక్షల విషయంలో సంతృప్తికరంగానే ఉన్న..ట్రీట్మెంట్ ఇంకా మెరుగుపర్చాలని అధికారులను అదేశించాం.
- కరోనా రెండవ దశలో జిల్లాలో 1 లక్ష 50 వేల మందికి పరీక్షలు చేయగా 4,000 కేసులు ఆక్టివ్ లో ఉన్నాయి. అందులో 50 మంది ప్రభుత్వ ఏరియా, జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మిగతావారు వైద్యుల సూచనల మేరకు హోమ్ ఇసొలేషన్ లో ఉన్నారు.
- జిల్లాలో ఇప్పటికే 40 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. మరో 90 బెడ్ల ఏర్పాటుకు బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో 50, దోమకొండ పిహెచ్సిలో 10, మద్నూర్ 10 ,ఎల్లారెడ్డిలో 10 ఆక్సిజన్ బెడ్లు పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. మొత్తం 140 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం.
- జిల్లాలో మందుల, ఇంజక్షన్ ల కొరత లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. రెమిడేసివిర్ ఇంజక్షన్ కొరత ఉన్నదని డిఎంహెచ్ఓ మా దృష్టికి తీసుకువచ్చారు. టీకాలు, ఇంజక్షన్ కొరత లేకుండా చూడాలని రాష్ట్ర అధికారులతో మాట్లాడాం. ఎలాంటి కొరత ఉండదు..ట్రీట్మెంట్ సక్రమంగా అందించండి. ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నాం..దానికి అవసరమైన నిధులు మంజూరు చేశాం.
- జిల్లాలో 30 వాక్సినేషన్ కేంద్రాల ద్వారా 2.30 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఒక లక్ష మందికి అనగా 44% టీకా వేసి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. జిల్లాలో రోజుకూ 4వేల నుండి 5మందికి టీకా వేస్తున్నాం.
- వ్యాక్సినేషన్ కోసం సిబ్బంది కొరత ఉన్నందున కొంత మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలో తాత్కాలిక పద్దతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్,మెడికల్ ఆఫీసర్లను అవసరమైన మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించుకోవాలని అదేశించాం.
- అలాగే రెవెన్యూ,పోలీసు విభాగాలతో ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ ఏర్పాటు చేసి మహారాష్ట్ర బార్డర్ లో రాకపోకలపై నిఘా ఏర్పాటు చేశాం.
- తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకురండి..మార్కెట్, కిరాణా, జనరల్ షాపులు, విక్రయాల షాపుల్లో తప్పనిసరిగా మస్కులు వాడాలి. సానిటైజర్లు వినియోగించాలి.
- ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ప్రజల ఆరోగ్య దృష్ట్యా పోలీసు వారిని కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించాం.
- మస్కు లేకుంటే ఫైన్ వేస్తారు. మాస్కులు దరించడమే శ్రీరామ రక్ష. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.
- కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున సరిహద్దు గ్రామాల్లో తగు చర్యలు తీసుకుంటున్నాం.
- సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా మస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.
- కోవిడ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కూడా దానికి సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తున్న" అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.