మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి

Related image

  • సంక్షేమం, అభివృద్ది రెండు క‌ళ్లుగా భావించి పాల‌న సాగిస్తున్న జ‌గ‌న‌న్న
  • రూ. 75 లక్షల రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుల‌కు శుంకుస్థాప‌న‌
విజ‌య‌వాడ: ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మెహ‌న్ రెడ్డి సంక్షేమం, అభివృద్ది రెండు క‌ళ్లుగా భావించి పాల‌న సాగిస్తున్నార‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం 39వ డివిజన్ లో ఆర్టీసీ వ‌ర్క్‌షాపు రోడ్డులో కెవిఆర్ బిల్డింగ్ వ‌ద్ద 75 ల‌క్ష‌ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో సీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు శుంకుస్థాప‌న చేశారు.

జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ హ‌యంలో విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దే ల‌క్ష్యంగా ప‌ని చేయ‌డం జ‌రుగుతుందన్నారు. ప‌శ్చిమ నియెజ‌క‌వ‌ర్గంలో డివిజ‌న్లు పోటాపొటిగా అభివృద్ది ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయన్నారు. నగరంలో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను గత ప్రభుత్వం హయాంలో దారి మళ్ళించడం జ‌రిగింద‌న్నారు. ఆగిపోయిన అన్ని రకాల అభివృద్ధి పనులను శరవేగంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. సీఎం జ‌గ‌నన్న విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి ప్ర‌త్యేక శ్రద్ధతో నిధులు కెటాయించిన్న‌ట్లు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, న‌గ‌ర పాల‌క సంస్థ  కమీషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్లు త‌దిత‌రులు  ఉన్నారు.

మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి

నగరంలో ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ, అవనీష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నాలుగు స్థంబాల సెంట‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు  ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే  ప్రాంతంలో సామాజిక దృక్పథంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జ‌రిగింద‌న్నారు. ప్రజలందరూ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేర్లు వైసీపీ శ్రేణులు ఉన్నారు.

More Press Releases