విజయవాడ నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- 75 లక్షల రూపాయలతో బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శుంకుస్థాపన
పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్ అభివృద్దికి అత్యధిక నిధులు కెటాయించడం జరిగిందన్నారు. డివిజన్‌లో కాలువలు, డ్రైనేజీలు మంచినీటి సమస్యలను పరిష్కరించడంలో స్థానిక కార్పొరేటర్ కృషిని మంత్రి అభినందించారు.
ఈ సందర్బంగా మంత్రి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి వినతి మేరకు కాలినడకన మంత్రి పలు విధులను పరిశీలించారు. అదే విధంగా హెచ్ బి కాలనీ డైయినేజీ పంపింగ్ హౌస్‌కు చుట్టు ప్రహరి గోడ నిర్మాణం పనులు చేపట్టాలని నగర పాలక సంస్థ అధికారులను అదేశించారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్ బెలం దుర్గ, స్థానిక కార్పొరేటర్లు మరియు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.