సీఎం కేసీఆర్ ఆదేశంతో రేషన్ డీలర్ల పాత బకాయిలు రూ.56.7 కోట్లు విడుదల: మంత్రి గంగుల కమలాకర్
- గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కోసంకృషి
- త్వరలో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ
- కరోనా వేల పేదలకు సత్వరం బియ్యం అందేలా ఏర్పాట్లు
- రేషన్ డీలర్ల అసోసియేషన్, ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్
పెండింగ్లో ఉన్న రూ.56.7కోట్ల బకాయిలను ప్రభుత్వం దృష్టికి తేగానే రేషన్ డీలర్లకు విడుదల చేశామని చెప్పారు. గత సంవత్సరన్నర కాలంగా నెలకొన్న గడ్డు పరిస్థితుల్లో అర్ధాకలితో ఎవరూ అలమటించకూడదని పౌరసరఫరాల శాఖ ఆద్వర్యంలోని రేషన్ డీలర్లు నిర్విరామంగా కృషి చేస్తున్నారని వారిపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాల్ని పూర్తి పారధర్శకంగా ప్రభుత్వ నిబందనల మేరకు చేపట్టాలని గంగుల ఆదేశించారు.
అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న తమ కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిందిగా అసోసియేషన్ ప్రతినిధులు కోరడంతో గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతిపాధనలు, విధివిదానాలను సిద్దం చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి. ప్రతీ నిరుపేద కడుపునింపాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు రేషన్ డీలర్లు కృషి చేయాలని, ఈ నెల సంకల్పించిన 15కిలోల ఉచిత బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, బియ్యం పక్కదారి పట్టకుండా సరఫరా చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు.
ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగిన కఠినంగా వ్యవహరిస్తామని, తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రి. ఈ నెల పంపిణీకి అవసరమైన 4లక్షల 31వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్దంగా ఉంచామని, ఐదో తారీఖు లోపు రేషన్ షాపులకు చేర్చి 87లక్షల 42వేల 590 కార్డుదారులకు 5నుండి పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని వారు కూడా విదినిర్వహణలో పూర్తి బాధ్యతతో వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.