మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.1432 కోట్లు మంజూరు: మంత్రి ఎర్రబెల్లి
- ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ అమలులో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13కోట్ల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 9కోట్ల పనిదినాలను కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. గత సీజన్లో ఈ సమయంలో 17 లక్షల 50 వేల కూలీలు పని చేస్తే ఈ సీజన్లో 35 లక్షల 50 వేలు ఉపాధి కూలీలు పని చేస్తున్నారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 32 జిల్లాల్లోని 540 మండలాలో కరోనా నిబంధనలలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.కరోనా నిబంధనల మేరకు కూలీలు కూడా మాస్కులు ధరించి పనులకు హాజరుకావాలని, చేతులను తరచుగా శానిటేషన్ చేసుకుని పనులు చేసేటప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు.
రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, కేసీఆర్ దార్శనికత వల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి అన్నారు. కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతుబంధు,రైతు భీమా, ధాన్యం కొనుగోలు వంటి అనేక అనేక సంక్షేమ,అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి దయాకర్ రావు అన్నారు. ఉపాధిహామీ పథకం లాంటి కేంద్ర పథకాల అమలులోను తెలంగాణ ఉందన్నారు.