కాలుష్య రహిత, సుంద‌ర‌ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌: మంత్రి బొత్స సత్యనారాయణ

Related image

  • రూ.8.91 కోట్ల‌తో ప‌ట‌మ‌ట మున్సిపల్ స్టేడియంను ప్రాంభించిన మంత్రులు బొత్స‌, వెల్లంపల్లి
విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ‌ను కాలుష్య రహిత, సుంద‌ర‌ నగరంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ అన్నారు. న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో పటమటలో రూ.8.91 కోట్ల‌తో ఆధునీక‌రించిన‌ చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ స్టేడియంను మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీ క‌రీమునీసా, నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జీ దేవినేని అవినాష్‌, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ బెలం దుర్గ‌, క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి బొత్స ప్రారంభించారు. భావితరాలు ఆరోగ్యంగా బతకాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, వ్యర్థాలు లేని భూమి ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత ఎక్కువ మొక్కలను పెంచాలని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ పిలుపునిచ్చారు.

కరోనా కష్టకాలంలోనూ ఆగని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు: మంత్రి వెల్లంపల్లి

ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదని దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 600 కోట్ల రూపాయలు విజయవాడ న‌గ‌రాభివృద్ధికి కేటాయించారన్నారు. రానున్న రోజుల్లో నగరంలో మరిన్ని ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు  చేపడతామని తెలిపారు.

అనంత‌రం స్టేడియంలో మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు మొక్క‌లు నాటారు. స్టేడియం అంద‌రికీ అందుబాటులో ఉండే విధంగా ఇన్‌డోర్‌, అవుట్‌డోర్ గ్రేమ్స్‌తో పాటు జీమ్‌, యోగా రూం ఏర్పాటు చేసిన్న‌ట్లు వివ‌రించారు.

కార్య‌క్ర‌మంలో వైసీపీ న‌గ‌రాధ్య‌క్షుడు బొప్ప‌న భ‌వ‌కుమార్‌, వైసీపీ కార్పొరేట్ల‌ర్లు, న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు, వైసీపీ శ్రేణులు ఉన్నారు.

More Press Releases