జ్ఞాన దీపికాను అభినందించిన విజ‌యవాడ క‌మిష‌న‌ర్‌

Related image

  • విద్యతోనే అభివృద్ధి సాధ్యం
విజ‌యవాడ: విద్యార్థులు క్రమ శిక్షణ కలిగిన విద్యను అవలంబించాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ మ‌రియు  APCOST- ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వ‌హించిన రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీల్లో న‌గ‌ర పాల‌క సంస్థకు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్ కార్పొరేషన్ స్కూల్ కు చెందిన 10వ త‌ర‌గ‌తి విద్యార్థి జ్ఞాన దీపికాను రెండవ ర్యాంక్ వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ను క‌లిసిన జ్ఞాన దీపికాను క‌మిష‌న‌ర్ అభినందించి, పుస్త‌కాల‌ను అందించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా దాదాపు 250 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో క్విజ్ లో పోటీ చేశారన్నారు. అందులో ఐదుగురికి ర్యాంకులు ప్ర‌కటించ‌డం జ‌రిగింది. మొద‌టి ర్యాంకు కర్నూల్ జిల్లాకు చెందిన రౌలిన్ బానిక్ (roulin banik) వరించగా.. రెండవ ర్యాంకుగా శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన శ్రీ‌కార్ మ‌రియు కృష్ణాజిల్లా విజ‌యవాడ నుంచి జ్ఞాన దీపికాకు రెండో ర్యాంకు ఇరువురిని ప్ర‌క‌టించారు. అదే విధంగా క‌డ‌ప‌కు చెందిన జ్యోతి, జస్వంత్ అంజలికి మూడవ ర్యాంకు వ‌చ్చింది. కార్య‌క్ర‌మంలో సైన్స్ మాష్టార్ మైనం హుసేన్ త‌దిత‌రులు ఉన్నారు.

More Press Releases