యజ్ఞంలా కొనసాగుతున్న పట్టణ ప్రగతి
- చురుకుగా పాల్గొంటున్న అధికారులు, ప్రజలు
- ప్రతీఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
- కరీంనగర్ లో ఐదో రోజు హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
ప్రతీ ఒక్కరూ విదిగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను కుటుంబ సభ్యుల్లాగా కాపాడాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభంతో ప్రాణవాయువు విలువ ప్రతీ ఒక్కరికీ తెలిసిందని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే మనందరం ఇంటికి ఆరు మొక్కల్ని నాటి సంరక్షించాలన్నారు. అవకాశం ఉన్న ప్రతీ చోట మొక్కల్ని నాటి వాటిని మహా వృక్షాలుగా ఎదిగేలా చూడాలన్నారు. కాంక్రీట్ జంగిల్లో సైతం హరిత వనాల్ని పూయించాలనే కంకణం కరీంనగర్ ప్రజలు పూనుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ కళా స్వరూపారాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, కార్పొరేటర్లు ఎదుల్లా రాజశేఖర్, సుధ గోని మాధవి- కృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ నందేల్లి ప్రకాష్, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.