టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే షూటింగ్ క్రీడాకారులను సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీలో టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే షూటింగ్ క్రీడాకారులకు చీర్స్ ఫర్ ఇండియా టోక్యో ఒలింపిక్స్ 2020 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సన్మానించారు.

అనంతరం రైఫిల్ షూటింగ్ లో మంత్రి పాల్గొన్నారు. గగన్ నారంగ్ సూచించిన రెండు టార్గెట్ లను మొదటి ప్రయత్నంలొనే పూర్తి చేసి షూటింగ్ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒలింపిక్స్ లో పతాకం సాధించి నేడు దేశ వ్యాప్తంగా షూటింగ్ లో శిక్షణను ఇస్తున్న ఒలంపియన్ గగన్ నారంగ్ అకాడెమీ హైదరాబాద్ అకాడెమీ లో దేశవ్యాప్తంగా టోక్యో ఒలింపిక్స్ కు ఎంపికైన 15 మంది షూటింగ్ క్రీడాకారులు హైదరాబాద్ లోని SATs శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారన్నారు.

చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లో ఎన్నో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయన్నారు. మన దేశంలో క్రీడాకారులు కూడా తమ శక్తి సామర్ధ్యాలను చాటి ఒలింపిక్స్ లో పతకాలు సాధించి దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి క్రీడాకారులకు, కోచ్ లకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన కు క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారన్నారు.ఒలింపిక్స్ లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాలను ఘనంగా పెంచామన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించామన్నారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో ఒలింపిక్స్ మెడలిస్ట్ గగన్ నారంగ్, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు దరియస్ చెన్నై, రాష్ట్ర రఫైల్ అసోసియేషన్ కార్యదర్శి కిరణ్, పరిపాలన అధికారి అలెస్జెండర్, క్రీడాకారులు ఇషా సింగ్, అంజు, ధనుష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases