లోతట్టు ప్రాంత ప్రజలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిరావాలి: విజయవాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్

Related image

  • న‌గ‌రంలో మూడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు
విజయవాడ: కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్ర‌జ‌లు పునరావాస కేంద్రములకు తరలిరావాల‌ని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వ‌స్తున్న కార‌ణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు.

గురువారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి స్వ‌యంగా న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఏర్పాట్లును ప‌రిశీలించారు. నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రములకు తరలి వెళ్ళాలని అధికారులు మైకు ద్వారా ప్ర‌చారం చేయ‌డం, తారకరామా నగర్, భుపేష్ గుప్తా నగర్ తదితర లోతట్టు ప్రాంతాలను క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి పరిశీలించారు.

పులిచింతల ప్రాజెక్ట్ నందు ఏర్పడిన సాంకేతిక ప్రమాదము కార‌ణంగా వరద నీరు ప్రకాశం బ్యారేజికి వచ్చే అవకాశం ఉన్నందున నది ప్రవాహక లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇందుకుగాను ప్ర‌జ‌ల‌కు ఇందిరాగాంధీ స్టేడియం, రాణిగారి తోట శాంపిల్ బిల్డింగ్, APSRM హైస్కూల్ నందు పునరావాస కేంద్రములను ఏర్పాటు చేసిన్న‌ట్లు వివ‌రించారు.

అక్కడ కావలసిన వారికి త్రాగు నీరు, విద్యుత్, టాయిలెట్స్ మరియు భోజన సౌకర్యం కల్పించుటం జ‌రిగింద‌న్నారు. కృష్ణ నది రిటర్నింగ్ వాల్ నిర్మాణం కార‌ణంగా ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు 524 నివాసాల వారిని గుర్తించి వారికీ సింగ్ నగర్ ప్రాంతములో నిర్మించిన జి.3 గృహ సముదాయాలలో ప్లాట్ కేటాయించుట జరుగింద‌ని, ఇప్పటి వరకు సుమారుగా 150 మందిని తరలించినట్లు మిగిలిన వారిని కూడా రెండు మూడు రోజులలో తరలించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases