త్వరలో రాజీవ్ గాంధీ పార్క్ సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి: విజయవాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్

Related image

విజయవాడ: సెప్టెంబ‌ర్ నెల నుంచి రాజీవ్ గాంధీ పార్కు నందు సందర్శకులకు అనుమతి ఇచ్చేలా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను వేగవంతం చేసి పూర్తి చేయాల‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ (ఐ.ఏ.ఎస్) సంబందిత అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి రాజీవ్ పార్క్ నందు చేపట్టిన సివిల్ మరియు గ్రీనరి అభివృద్ధి వ‌ర్క్ ప‌నుల యొక్క పురోగతిని ప‌రిశీలించారు.

పార్క్ ను పూర్తిగా ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌న్నారు. చిన్నారుల కోసం మ‌ల్టీ ప్టే గ్రేమ్స్ ఏర్పాటు చేయాల‌న్నారు. చిన్నారుల‌కు అందుబాటులో ఉండేలా పిల్ల‌ల పార్క్ నిర్మాణం జ‌ర‌గాల‌న్నారు. బ్రిడ్జి మ‌రమ్మ‌తులు, పార్క్ లో వాకింగ్ ట్రాక్ తో పాలు గెజిబో నిర్మాణం పనులు అన్ని పూర్తి చేయాల‌న్నారు. ప‌ర్యాట‌కుల‌కు, సంద‌ర్శ‌కుల‌కు ఎటు చూసిన ప‌చ్చ‌ద‌నంతో క‌నువిందు చేసే విధంగా పార్క్ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. ఎమ్యూజ్ మెంట్‌ పార్కులో ఉండే విధంగా ఓపెన్ ఎయిర్‌ థియేటర్ తో కూడి మ్యూజిక్ ఫౌంటెన్ నకు తగిన మరమ్మతులు నిర్వహించి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) వై.వి. కోటేశ్వరరావు, ఉద్యానవన శాఖాదికారి జె.జ్యోతి మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases