మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో... డాలస్ లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సాస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన డాలస్ లో నెలకొని ఉన్న గాంధీ మెమోరియల్ దగ్గర 75 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగష్టు 15న కోవిడ్ నిబంధనలకు లోబడి అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయుల మధ్య ఘనంగా జరిగాయి.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర.. పిల్లలు, పెద్దల కేరింతల మధ్య భారత జాతీయ పతాకావిష్కరణ చేసి, మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు. డా. తోటకూర మాట్లాడుతూ గాంధిజీతో సహా ఎంతో మంది జాతీయ నాయకులు, స్వాతంత్ర్య యోధుల త్యాగ ఫలితంగా సాధించుకున్న 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో మనం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించినా, ఇప్పటికీ కొన్ని వేల గ్రామాలల్లో కనీస వసతులైన మంచి నీరు, విద్యుత్, విద్యా, వైద్య సదుపాయాలు లేకపోవడం శోచనీయం అని అన్నారు. చిత్తశుద్ధితో పాలకులు, అంకిత భావంతో ప్రజలు కలసి పనిచేస్తే తప్ప ఆశించిన అభివృద్ధి సాధించలేమన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారత దేశాభివృద్ధిలో తమ వంతు కృషితో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, కమ్యూనిటీ నాయకులు ఉర్మీత్ జునేజా, సల్మాన్ ఫర్షోరి, దినేష్ హూడా, షబ్నం మోడ్గిల్, ఎం.వి.ఎల్ ప్రసాద్, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, పులిగండ్ల విశ్వనాధం, ములుకుట్ల వెంకట్ లు,
పిల్లలు పెద్దలు చిరు జల్లుల మధ్య గాంధీజీకి నివాళులర్పించి, మిఠాయిలు తింటూ ఆహ్లాదంగా గడిపారు.