మొదటి విడతలో 15 వేల స్కూల్స్ అభివృద్ధి: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- తర్వలో 40 లక్షల రూపాయలతో మౌలానా ఆజాద్ ఉర్దూ స్కూల్ అభివృద్ధి పనులు: దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- విద్యాతోనే అభివృద్ధి: విజయవాడ మేయర్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్టంలో దాదాపు 56 వేల స్కూల్స్ ఉన్నాయని, అందులో మొదటి విడతలో భాగంగా 15 వేల స్కూల్స్ అభివృద్ధి చేయడం.. చిన్నారులకు రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో బాత్‌రూమ్‌కు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేదిని కానీ ఇప్పుడు రన్నింగ్ వాటర్‌తో పరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. కరోనాతో అందరు ఇబ్బంది పడుతుంటే కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చడం జరిగిందన్నారు. స్వర్గీయ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి యువత ఉన్నత విద్యాకు ఫిజురియింబర్స్ మెంట్ అందజేస్తే.. నేడు వారి తనయుడు సీఎం జగన్ మెహన్ రెడ్డి చిన్నారుల చదువుకు చేయూతనిస్తున్నారన్నారు.
విద్యాతోనే అభివృద్ధి: మేయర్
అందరికీ నాణ్యమైన విద్యా అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. జగనన్న చిన్నారుల విద్యాభివృద్దికి అమ్మఒడి, విద్యాకానుక, వసతి దీవెన వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిరంతరం నగరాభివృద్ది ధ్యాసగా పని చేయడం మనందరి అదృష్టం అని అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాదేవ అప్పాజీ, మరుపిళ్లా రాజేష్, అబ్దుల్ అకిమ్ అర్షద్, పాఠశాల ప్రదానోపాధ్యాయ మరియు ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.