సామాజిక పెన్షన్లపై దుష్ప్రచారం: విజయవాడ మేయర్
- 1వ తేదీనే 97% శాతం మందికి పెన్షన్స్ అందజేత
- ఎవరికి అవసరమో వారి వారకే పెన్షన్స్ అందించాలనది ప్రభుత్వ లక్ష్యం
- కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారు
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందే తాము అధికారంలోకి రాగానే పెన్షన్ రెండువేలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే శాచురేషన్ పద్ధతిలో అర్హలైనవారికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇప్పుడు రూ.2250 పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వచ్చే అయిదేళ్లలో దశలవారిగా పెంచుకుంటు వెళతామని, అర్హతను బట్టి పెన్షన్లు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుస్తున్నాం. నెల తిరిగేసరికి పెన్షన్ తీసుకుంటున్న వృద్ధుల మొహాల్లో సంతోషం చూస్తున్నాం అని అన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటున 39 లక్షలు పెన్షన్లు ఇస్తే..వైయస్సార్ సీపీ ప్రభుత్వం 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నదని చెప్పారు. బాబు హయాంలో పెన్షన్లకు సగటున రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. దానికి మూడింతలు ఎక్కువగా రూ.1500 కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడుతున్నది జగనన్న ప్రభుత్వం అన్నారు. విజయవాడ పశ్చిమలో 20585 మందికి 4,95,89000 రూపాయలు, విజయవాడ సెంట్రల్ లో 24463 మందికి 5,91,20,500 రూపాయలు, విజయవాడ తూర్పులో 20428 మందికి 4,94,58,250 రూపాయలు, నగరంలో దాదాపు 64055 మందికి 15,10,43,500 రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు.
పెన్షన్లకు సంబంధించి రెండున్నరేళ్లకు ముందు ఎలా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఈ ఫలాలను అందుకున్న వారిని అడిగితే చెబుతారు అన్నారు. పిల్లలపై ఆధారపడకుండా వృద్ధులకు ఎంతో కొంత ఆసరాగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. హైదారాబాద్ /బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉండి నెలానెలా ఫంచన్లు తీసుకోకుండా ఉన్న వారికి మాత్రమే ఇబ్బంది. 1 లేదా 1.5 % మంది ఎక్కడెక్కడో ఉంటూ ఐదు నెలలకి ఒకసారి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. ఇలా పెన్షన్ తీసుకునే వారిలో మాజీ ప్రజాప్రతినిధి తల్లిపేరు లేదా 35 ఎకరాల పొలం/అగ్రవర్ణం/ వందల కోట్ల కాంట్రాక్టర్ అయిన కొడుకు..ఇలా ఎందరో ఉన్నారు. వారికి మాత్రమే ఇబ్బంది అన్నారు.
సంక్షేమ పథకాలకు ఈకేవైసీ ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేసింది. అన్ని పథకాలకు ఇది తప్పనిసరి. ప్రతినెలా తీసుకునే వారికి ఫించన్లు 1వ తేదీనే 97% శాతం మంది అందిస్తున్నాం అని మేయర్ స్పష్టం చేశారు.
46వ డివిజన్‌లో 25లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన:సచివాలయంలో పని చేసే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. శనివారం 46వ డివిజన్‌లో 25లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు మేయర్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. మిల్క్ ప్రాజెక్టు ఎదురు కొండ ప్రాంతంలో పాడైన డ్రైన్లు, మెట్లు అభివృద్ది పనులు మేయర్ ప్రారంభిస్తూ, పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అనంతరం 17వ డివిజన్‌లో రాణిగారితోట శాంపిల్ బిల్డింగ్ లోని ఆరోగ్య కేంద్రం, సచివాలయాలు సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రం లో ప్రజలకు అందుబాటులో గల సదుపాయాలు ఇంకా పెంచుతాం అని తెలిపారు. అదే విధంగా వ్యాక్సిన్ జరుగుతున్న విధానం అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం 90 మీటర్లు కొత్త పైపుల పనులకు డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ తంగిలా రామిరెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాంతంలోని సిద్దం కృష్ణరెడ్డి కళ్యాణ మండపానికి తగిన మరమ్మతులు చేయించి, మరింత హంగులతో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు సూచిస్తూ, కృష్ణలంక ఫీడర్ రోడ్ నందు సుమారు 70 మీటర్ల పొడవున ప్రహరి నిర్మాణమునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి తమ దృష్టికి తీసికొచ్చిన సమస్యలను పరిశీలించి, తర్వలో పరిష్కారిస్తామన్నారు.
కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారావు మరియు ఇతర అధికారులు, సచివాలయ, ఆరోగ్య సిబ్బంది స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.