‘గెస్ట్ గాట్ టాలెంట్ సీజన్2' ఎంట్రీల కోసం దరఖాస్తుల ఆహ్వానం!
డయాలసిస్ రోగుల కోసం ‘గెస్ట్ గాట్ టాలెంట్’ సీజన్2 ను ప్రకటించిన నెఫ్రోప్లస్
ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఉత్సాహంతో ఉన్న డయాలసిస్ రోగులు తమ ఫైల్‌ను నెఫ్రోప్లస్ ఫేస్‌బుక్ / ట్విట్టర్ పేజీలో అప్‌లోడ్ చేయవచ్చు. (https://www.facebook.com/NephroPlusDialysisNetwork/) లేదా ([email protected]) మెయిల్ ఐడీకి పంపింపవచ్చు. రోగి పేరు, రోగి సంప్రదింపు వివరాలు, పేషెంట్ డయాలసిస్ సెంటర్ & సిటీ గురించి తెలియజేయాలి. ఫైల్ అనేది ఆడియో / వీడియో క్లిప్ లేదా పెయింటింగ్ / డ్రాయింగ్ లేదా వారి ప్రతిభను ప్రదర్శించే మరేదైనా అంశం కావచ్చు.
ప్రతీవారం నెఫ్రోప్లస్ తమ సోషల్ మీడియా పేజీలో పాల్గొన్న వారి ఎంట్రీల నుండి 2019 సెప్టెంబర్ 30 వ తేదీన టాలెంట్ హంట్ కార్యక్రమం ముగిసే వరకు ఒక ఎంట్రీని అప్‌లోడ్ చేస్తుంది. టెలివిజన్ & మీడియా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ జ్యూరీ ఎంపిక ప్రక్రియలో భాగంగా 2 విజేతలను గుర్తిస్తుంది. వారిని నెఫ్రోప్లస్ ఇతర పోటీదారులు, కొంతమంది ప్రఖ్యాత వ్యక్తులతో కలపి ఘనంగా జరిగే కార్యక్రమంలో సత్కరిస్తుంది.
టాలెంట్ షో గురించి వ్యవస్థాపకుడు & సీఈఓ మిస్టర్ విక్రమ్ వుప్పాలా మాట్లాడుతూ, “డయాలసిస్ పై ఉండే ప్రతీ వ్యక్తిని వ్యాధిపై నుండి వారి దృష్టిని మరల్చడానికి, వారు తమలోని ప్రతిభను గుర్తించేలా ప్రోత్సహించడాన్ని నెఫ్రోప్లస్ లో మేము నమ్ముతున్నాం. గెస్ట్ గాట్ టాలెంట్ కార్యక్రమం ద్వారా వారికి ఒక వేదికను అందించినందుకు మేము సంతోషిస్తున్నాం. డయాలసిస్ పై ఉన్నవారు తమ సృజనాత్మకను చాటుకోవడం, వారి ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించడం పట్ల నేను సంతోషిస్తున్నాను" అని అన్నారు.
నెఫ్రోప్లస్ గురించి:
భారతదేశ అతిపెద్ద డయాలసిస్ ప్రొవైడర్ నెట్‌వర్క్ అయిన నెఫ్రోప్లస్, నాణ్యమైన సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారించి అత్యధిక నాణ్యత గల డయాలసిస్ సేవలను అందిస్తోంది. డయాలసిస్ తక్కువ ఒత్తిడితో కూడుకున్నదిగా చేయడంలో విజయవంతంగా మార్గదర్శకత్వం వహించింది. ప్రజలను ఒప్పించింది. నెఫ్రోప్లస్ ప్రస్తుతం భారతదేశంలోని 19 రాష్ట్రాలలో 113 నగరాల్లో 195 కేంద్రాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా డయాలసిస్ చేసిన వ్యక్తులను దీర్ఘ, సంతోషకరమైన, ఉత్పాదక జీవితాలను గడపడానికి వీలు కల్పిస్తుంది. నెఫ్రోప్లస్ తన అతిథులకు తన ప్రాధాన్యతగా నాణ్యమైన సంరక్షణను అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. 195 కేంద్రాలలో ప్రతీ కేంద్రంలో కేటాయించిన వైద్యులు, నర్సుల బృందాన్ని నిర్వహిస్తోంది. భారతదేశంలో, వెలుపల డయాలసిస్ సంరక్షణను పునర్నిర్వచించడమే దీని లక్ష్యం.
For further information: https://www.nephroplus.com/