పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా: మంత్రి జగదీష్ రెడ్డి
- 2020-21లో 56,111 మిలియన్ యూనిట్ల వినియోగం
- గృహ, వాణిజ్యలకు వినియోగించింది 17,935 మిలియన్ యూనిట్లు
- ఇండస్ట్రియల్, వ్యవసాయం లిఫ్టుల వినియోగానికి 38,176 యూనిట్లు
- రాష్ట్రం ఏర్పడే నాటికి 6,660 మేఘవాట్ల డిమాండ్
- 2021 మే నెలలో 13,686 మేఘవాట్లకు పెరిగిన డిమాండ్
- సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3,489 మేఘావాట్లు
- చత్తీస్ ఘడ్ నుండి యూనిట్ కు 3.90 తాత్కాలిక టారిఫ్ తో కొనుగోళ్లు
- 2020-21 నాటికి టి యస్ డిస్కమ్ లతో వచ్చిన ఆదాయం 30,330 కోట్లు
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 21 నాటికి 13,865 కోట్లు
- శాసనమండలిప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి
కాగా 2020-21లో 56,111 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను రాష్ట్రంలో వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. గృహ, వాణిజ్యాలకు 17,935 మిలియన్ యూనిట్లు, ఇండస్ట్రియల్, వ్యవసాయ, లిఫ్ట్ ల నిర్వహణకుగాను 38,176 యం.యు ల వినియోగం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6,660 మేఘావాట్ల డిమాండ్ ఉండగా ఈ సంవత్సరం మే నాటికి ఆ డిమాండ్ 13,686 మేఘావాట్లకు చేరిందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన పాలసీతో 3,489 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. చత్తీస్ ఘడ్ నుండి తాత్కాలిక టారిఫ్ తో ఒక్కో యూనిట్ కు 3.90 పైసలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే విదంగా 2020-21 నాటికి టీఎస్ డిస్కమ్ ల ఆదాయం 30,330 కోట్లు ఉండగా ఈ సంవత్సరం ఆగస్టు 31 నాటికి 13,865 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి సభకు వివరించారు.