ఆర్మీ రిక్రూట్ మెంట్ కు అపూర్వ స్పందన

Related image

  • మొట్టమొదటి ప్రయత్నం విజయవంతం
  • సూర్యపేటకు తరలివచ్చిన తెలంగాణం
  • పాల్గొన్న1962 మంది యువతీ,యువకులు
  • శిక్షణ కు ఎంపికయిన 274 మంది అభ్యర్థులు
  • శిక్షణాకాలంలోవసతి, బోజనాది సౌకార్యాల కల్పనకు ముందుకు వచ్చిన గుంటకండ్ల సావిత్రమ్మ ఫౌండేషన్
  • సభా వేదిక మీద నుండే ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యపేట: జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యపేట లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించాలి అనుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నం విజయవంతం అయింది.తొలి ప్రయత్నం లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1962 మంది యువతీ యువకులు, ఆర్మీ రిక్రూట్ మెంట్ లో బాగంగా జరుపు ఆర్మీ ప్రీ ర్యాలీ కి తరలి రావడం నిర్వాహకులను ఆశ్చర్యచకితులను చేసింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా గా ఉన్నప్పుడు అడపా, దడపా నిర్వహించే ఈ ర్యాలీ లో పాల్గొనడం మారు మూల ప్రాంతాలకు చెందిన యువతీ,యువకులకు భారంగా పరిణమించేది.ఈ నేపద్యంలో సూర్యపేట కు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణంతో ఆర్మీ ఉన్నతాధికారులు సూర్యపేట కు తరలి వచ్చినప్పుడు ఈ విషయాన్ని శౌర్యచక్ర,సేనా మెడల్ తో పాటు వీర చక్ర పొందిన ఆర్మీ రిక్రూట్ మెంట్ డైరెక్టర్ కల్నల్ మనోజ్ కుమార్ దృష్టికి మంత్రి జగదీష్ రెడ్డి తీసుకొచ్చారు.

అందుకు స్పందించిన ఉన్నతాధికారులు సూర్యపేట కే చెందిన ది సోల్జర్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీనివాసరావు ను ముందు పెట్టి ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రీ ర్యాలీకి పచ్ఛ జెండా ఉపారు.ఈ క్రమంలోనే పాలనా పరమైన అనుమతుల కొరకై మంత్రి జగదీష్ రెడ్డి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కు సమాచారం వెళ్లడం అక్కడ అనుమతి లభించడం వంటివి చకచకా జరిగి పోయాయి.అనుమతులు లభించిన అనతి కాలంలోనే ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రీ ర్యాలీకి స్వల్ప విరామం ఉన్నప్పటికీ మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకుని సమాచారం మారు మూల ప్రాంతాలకు చేర వేయడం, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయడం అందుకు స్పందించిన జిల్లా యస్ పి రాజేంద్రప్రసాద్ కింది స్థాయి అధికారులతో సోషల్ మీడియాలో ప్రచారం గల్పించడంతో ముందేన్నడు లేని రీతిలో ఆశించిన దానికి రెట్టింపు సంఖ్యలో యువతీ యువకులు తరలి రావడం నిర్వాహకులకు సంతృప్తినిచ్చిందని సోల్జార్  ఫౌండేషన్ ఫౌండర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఈ రోజు జరిగిన ర్యాలీకి మొత్తం 1962 మంది పాల్గొనగా అందులో 274 మంది ఎంపికయ్యారని ఆయన వివరించారు. వీరికి సూర్యపేట జిల్లా కేంద్రంగా డిసెంబర్ 1 నుండి రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు.  

More Press Releases