బెస్ట్ క్లీనెస్ట్ సిటీ అవార్డు క్యాటగిరిలో విజయవాడకు 3వ ర్యాంక్
- జాతీయ స్థాయిలో బెస్ట్ క్లీనెస్ట్ సిటీ అవార్డు క్యాటగిరిలో 3వ ర్యాంక్ కైవసం
- ఢిల్లీలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదగా అవార్డు స్వీకరించిన నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కింద “ఉత్తమ పరిశుభ్ర నగరముల” కేటగిరీలో భారతదేశంలోని అన్ని నగరాలలో విజయవాడ నగరం 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అవార్డును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదగా నగర మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయిలతో కలిసి అవార్డ్ ను స్వీకరించారు.
“చెత్త రహిత నగరం” కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని నగరాల్లో విజయవాడ నగరం మాత్రమే చెత్త రహిత నగరంగా 5 స్టార్ రేటింగ్ సాధించి అవార్డును సాధించింది. ఈ అవార్డును కేంద్ర హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి చేతుల మీదుగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, యు.శారదా దేవి – అడిషనల్ కమీషనర్ (ప్రాజెక్ట్స్) మరియు ఎం.ప్రభాకరరావు చీఫ్ ఇంజనీరు అధికారులతో కలసి స్వీకరించుట జరిగింది.
అదే విధంగా 9 నగరాలలో విజయవాడ నగరం వాటర్ ప్లస్ సిటీగా PrerakDauur Samman Award ను - Gold (Anupam) కేటగిరీనందు కైవసం చేసుకుంది. చెత్త సేకరణ విధానములో వ్యర్థాలను తడి, పొడి మరియు ప్రమాదకర విభాగాలుగా విభజించడం. 2. ఉత్పత్తి చేయబడిన తడి వ్యర్థాలకు వ్యతిరేకంగా ప్రాసెసింగ్ సామర్థ్యం. 3. తడి మరియు పొడి వ్యర్థాలను ప్రాసెస్ చేయడం మరియు రీసైక్లింగ్ చేయడం. 4. నిర్మాణం &కూల్చివేత (C&D) వ్యర్థాల ప్రాసెసింగ్. 5. ల్యాండ్ఫిల్లకు వెళ్లే వ్యర్థాల శాతం. 6. నగరాల పారిశుద్ధ్య స్థితి మొదలగు క్యాటగిరిలలో విజయవాడ నగరం ఈ అవార్డు సాధించుట జరిగింది.
ఈ స్థితిని సాధించడంలో తమ సూచనలను, సలహాలను అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు ధన్యవాదములు తెలిపారు.
అదే విధంగా, ఈ మహత్తర కార్యంలో పాలుపంచుకున్న పబ్లిక్ హెల్త్ వర్కర్లు, వార్డు శానిటేషన్ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, హెల్త్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు మరియు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డులు సాధించడం విజయవాడ నగరానికి గర్వకారణమని కమిషనర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారుల మరియు సిబ్బంది యొక్క సమిష్టి కృషి ఫలితమే ఈ అవార్డులను సాధించుట అనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు.
విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నగర పౌరులు తమవంతు సంపూర్ణ సహకారం అందించి ఈ అవార్డులను సాధించడంలో వారి మద్దతు తెలిపారనీ, వారి సహకారము లేకుండా, ఈ స్థితిని సాధించడం సాధ్యం కాదనీ, అందుకుగాను నగర పౌరులకు విజయవాడ నగర పాలక సంస్థ కృతజ్ఞతలు తెలుపుకుంటోందని అన్నారు.