దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు: మల్లాది విష్ణువర్ధన్
- నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
- ప్రజలకు ఆహ్లాదకరంగా పార్క్ ల సుందరీకరణ: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ప్రధాన కూడళ్ళ లో హైమాస్టా లైట్ల్ ఏర్పాటుకు శంఖుస్థాపన:
సర్కిల్ – 2 పరిధిలో నగరపాలక సంస్థ సాధారణ నిధులతో రూ. 14,17,000/- అంచనాలతో 63వ డివిజన్ ఉడా కాలనీ రాజీవ్ నగర్ నందు, 58 వ డివిజన్ సాయిబాబా గుడి మెయిన్ రోడ్, 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరీ పేట బ్రిడ్జి క్రింద మరియు డ్రెయినేజి పంపింగ్ స్టేషన్ వద్ద, హై మాస్టా లైట్ ల స్తంభాల ఏర్పాటుకు, అదే విధంగా రూ. 4,60,000/- అంచనాలతో 31వ డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ రోడ్ లో హై మాస్టా లైట్ల స్థంబాల ఏర్పాటు కు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.
ఈ సందర్బంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. నేడు 62వ డివిజన్ నందు 15 లక్షల అంచనాలతో ప్రకాష్ నగర్ మరియు వీరబాలరాజు పార్క్ స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించుటతో పాటుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయుట వల్ల స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరిస్తూ, ప్రతి ఒక్కరి వీటిని సద్వినియోగ పరచుకోవాలని అన్నారు.
అదే విధంగా శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వం వదిలి వేసిన అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావటం జరుగుతుందని అన్నారు. 62వ డివిజన్ పరిధిలోని రెండు పార్క్ లలో ప్రహరీ గోడ మరమ్మత్తులు, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు మరియు గ్రీనరీతో ఆకర్షనియంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని అన్నారు. అదే విధంగా పలు ముఖ్యమైన కూడళ్ళలలో విద్యుత్ దీపాల ఏర్పాటు శ్రీకారం చుట్టినట్లు అయన వివరించారు. స్థానిక కార్పొరేటర్లు వారి వారి డివిజన్ లలో ఎదుర్కోను ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటి పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, ఇసరపు దేవి, పెనుమత్స శిరీష మరియు పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు ఎస్. ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, ఇతర అధికారులు సిబ్బంది మరియు స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
54వ డివిజన్ సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిశీలన: దేవాదాయ మరియు దర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు:
పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పరిధిలోని పలు వీధులలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ మరియు అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థానికంగా గల సమస్యలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు.
ఈ సందర్బంలో డివిజన్ లోని పలు వీధులలో చెత్త మరియు వ్యర్దములు ఉండుట మరియు సైడ్ డ్రెయిన్ లలో పూడిక తొలగించకపోవుట వల్ల మురుగునీరు ప్రవాహం సక్రమముగా లేకపోవుట గమనించి మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానమును అవలంభించాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ మరియు సైడ్ డ్రెయిన్ లలో పూడికలను తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అన్నారు.
అదే విధంగా ఎండోమెంట్ వారికీ సంబందించిన రాంగోపాల్ సత్రము వారితో చర్చిoచి సత్రం డ్రెయిన్ నందు పూడిక తీయు పనులు చేపట్టాలని సూచించారు. డివిజన్ పరిధిలో ప్రజలకు అందించు రక్షిత మంచినీటి సరఫరా నందలి లీకేజిలను గుర్తించి వాటిని అరికట్టాలని మరియు పాడైన రోడ్ల పునరుద్దరణకు తగిన అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
రైతు బజార్ భవనం ప్రారంభం:
54వ డివిజన్ పరిధిలోని వించిపేట నందు రూ.51.92 లక్షల ప్రభుత్వ మరియు VMC సాధారణ నిధులతో నిర్మించిన రైతు బజార్ G 1 నూతన భవన సముదాయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ తో కలసి ప్రారంభించారు.
ఈ ప్రాంత వాసులకు అందుబాటులో ఉండే విధంగా భవనం గ్రౌండ్ ఫ్లోర్ నందు రైతు బజార్ ఏర్పాటు చేయుట జరిగిందని వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక కార్పోరేటర్ల సూచనల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమములను నగరపాలక సంస్థ చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి వివరించారు. అదే విధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరాభివృద్ధియే లక్ష్యంగా నగరపాలక సంస్థ అనేక కోట్ల నిధులతో ప్రజలకు అందించు మౌలిక సదుపాయాల మెరుగుదలకై వివిధ అభివృద్ధి పనులను చేపట్టి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని వివరిస్తూ, ప్రజలు వీటిని సక్రమముగా వినియోగించుకోవాలని అన్నారు.
కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లతో పాటుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు మరియు ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.