వించిపేట కొండ ప్రాంతాలలో సమస్యల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి: మంత్రి వెల్లంపల్లి
- 55 డివిజన్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
అదే విధంగా కొండ ప్రాంతములో జరుగుతున్న రిటైనింగ్ వాల్ యొక్క నిర్మాణ పనుల పురోగతి పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, నిర్మాణ పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని అధికారులకు సూచించారు. అదే విధంగా డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరియు ప్రజలకు అందించు రక్షిత మంచి నిటి సరఫరా విధానమును స్థానిక ప్రజలను మరియు అధికారులను అడిగి తెలుసుకొని కొండ ప్రాంతాలలో త్రగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని మరియు ఎక్కడైనా వాటర్ పైప్ లైన్ లికేజిలు ఉన్నట్లయితే వాటిని యుద్దప్రాతిపధిక నివారించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొండ ప్రాంతములో మెట్ల మార్గం నందు ఏమైనా మరమ్మతులు నిర్వహించవలసిన యెడల వాటికీ అగు అంచనాలు తాయారు చేసి పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
తదుపరి నైజాం గేట్ వద్ద గల గార్బేజ్ కలెక్టింగ్ రోలర్ మెషిన్ ను పరిశీలించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి సంబందిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేస్తూ, మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ నందు మురుగునీటి ప్రవాహమునకు అవరోధం కలుగకుండా డ్రెయిన్ లలో ఎప్పటికప్పడు సిల్ట్ తొలగించాలని ఆదేశించారు.
పై పర్యటనలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది మరియు వై.సి.పి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.