కరోనా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు: మంత్రి జగదీష్ రెడ్డి
- ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో చికిత్సలు
- మొదటి దశ వ్యాక్సినేషన్ 99.83 శాతం పూర్తి
- 70 శాతానికి చేరుకున్న రెండో దశ వ్యాక్సినేషన్
- 15 నుండి 17 సంవత్సరాల యువతకు 61.42
- మారుమూలప్రాంతాలలోనిఅందుబాటులో వ్యాక్సినేషన్
ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వ్యాధి గ్రస్తులకు ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ 5995 మందికి వేసినట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోనా. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ ల బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 614 కరోనా యాక్టివ్ కేసులు 3.08 శాతం ఉన్నాయని అన్నారు.8 మంది మాత్రమే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, ఏరియా ఆసూపత్రులు,పి.హెచ్. సి.లలో కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు, ఐసోలేషన్ కిట్లకు కొరత లేదని మంత్రి తెలిపారు.
నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నకిరేకల్ ఏరియా ఆసుపత్రి లో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిస్థితులు మెరుగు పరచాలని అన్నారు.నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రి లో డయాలి సీస్ రోగులకు ప్రస్థుతం ఉన్న 10 పడకలకు మరో 10 పడకలు పెంచాలని కోరారు.మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో డయాలిసీస్ రోగులకు ప్రస్తుతం ఉన్న 5 బెడ్లకు మరో 5 బెడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ దేవరకొండ ఏరియా ఆసుపత్రికి డయాలిసీస్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలెటర్లు, పడకలు పూర్తిస్థాయిలో సిద్దంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని సౌకర్యాలని సిద్దంగా ఉంచామని తెలిపారు. ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లు పైబడి అనారోగ్యంతో ఉన్న వృద్దులకు బూస్టర్ డోస్ నుండి అందిస్తున్నామని అన్నారు. 15 నుండి 18 సంవత్సరం గల వయస్సు వారందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ అందిస్తున్నామని తెలిపారు. కరోనా, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎం.ఎల్.సి.ఎం.సి.కోటి రెడ్డి, శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, జిల్లాకలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు, డి.సి.హెచ్.ఎస్.డా.మాతృ, వైద్య అధికారులు పాల్గొన్నారు.