సచివాలయ సిబ్బంది అంకిత భావంతో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేయాలి: వీఎంసీ కమిషనర్ రంజిత్ భాషా
విజయవాడ: కృష్ణలంక ప్రాంతములో గల 101వ వార్డ్ సచివాలయమును కమిషనర్ పి.రంజిత్ భాషా సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి సచివాలయ సిబ్బంది యొక్క పని విధానమును పరిశీలించారు. సచివాలయ సిబ్బంది హాజరు, మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలిస్తూ, విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ, ప్రజలకు సంక్షేమ పథకములను చేరువ చేసే విధంగా పని చేయాలని సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ను లబ్ధిదారులకు వివరించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని అన్నారు. ఈ సందర్భంలో సచివాలయ ఉద్యోగుల హాజరుశాతాన్ని పరిశీలించి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకముల వివరాలు మరియు లబ్దిదారుల జాబితా మొదలగునవి ప్రజలకు అందుబాటులో ఉండేలా డిస్ ప్లే బోర్డు నందు ఉంచాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కొరకు వచ్చు ప్రజల విన్నపములను సహనముతో పరిశీలించి, అర్జీదారులు తృప్తి చెందు విధంగా పరిష్కరించవలెనని సచివాలయ సిబ్బందికి సూచించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి నగరాభివృద్ధిపై చర్చించిన కమిషనర్:నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని సోమవారం కమిషనర్ పి.రంజిత్ భాషా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంలో నగరపాలక సంస్థ నందు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల యొక్క వివరలతో పాటుగా పనుల యొక్క పురోగతిపై ఇరువురు చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకములను ప్రజలకు చేరువ చేసే దిశగా మరియు నగర ప్రజలకు అందించు మౌలిక సదుపాయాల మెరుగుదలకు చేపట్టవలసిన చర్యలపై మేయర్ కమిషనర్ తో చర్చించి ప్రజాప్రతినిధులుగా మా తరపున అవసరమైన సహకారాని, తోడ్పాటు ఎల్లపుడు అందించగలమని పేర్కొన్నారు.
టిడ్కో గృహ ఋణాలపై బ్యాంకర్లతో సమీక్ష:
విజయవాడ నగరపాలక సంస్థ మరియు టిడ్కో గృహ ఋణాల మంజూరు చేయు విషయమై సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ పి.రంజిత్ బాషా అద్యక్షతన బ్యాంకర్లతో సమవేశం నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో కమిషనర్ రంజిత్ బాషా గృహ ఋణాల మంజూరు వివరాలు అడిగితెలుసుకోని పలు సూచనలు చేస్తూ, గ్రౌండ్ లెవెల్ కన్స్టక్షన్లో ఉన్న 3696 యూనిట్ లకుగాను ఇప్పటివరకు మంజూరు చేయబడిన 949 మినహాయించి, మిగిలిన 2747 లబ్దిదారులకు విడుదల చేయించవలసిన లోన్లను రానున్న 15 రోజులలోపు ఋణ సదుపాయాలను విడుదల చేయుటకు చర్యలు తీసుకోవలసినదిగా బ్యాంకర్లను ఆదేశించారు.
ఈ సందర్భంలో టిడ్కో – పి.డి చిన్నోడు మాట్లాడుతూ నిర్మాణానికి కావలసిన 21 బ్లాక్ ల నిర్మాణముల కొరకు టెండర్లను పిలిచామని 45 రోజులలో పూర్తి చేస్తామని కమిషనర్ కి వివరించారు. ఈ సమవేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ టి.సుధాకర్, డి.సి.ఓ, సి.డి.ఓ లు మరియు 13 బ్యాంక్ ల కో-ఆర్డినేటర్ల, 79 బ్యాంక్ మేనేజర్లకు తదితరులు పాల్గొన్నారు.