మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ టాప్: మంత్రి జగదీష్ రెడ్డి
- వరంగల్ అభివృద్ధి తెలంగాణకు రోల్ మోడల్
- కాళోజీ, కాకతీయుల చరిత్ర ప్రభుత్వ నిర్మాణాలకు ప్రతిరూపాలు
- ఫ్లోరోసిస్ ను నిర్ములించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది
- ఉద్యమాలతో పాటు అభివృద్ధికి ఓరుగల్లు దిక్సూచి
- పట్టణాభివృద్ధిలో మంత్రి కేటీఆర్ కు సాటిరారెవరు
- ప్రపంచ దేశాల నుండి వస్తున్న ప్రశంసలు అందుకు తార్కాణం
ఈ సందర్భంగా అంబెడ్కర్ జంక్షన్, కాళోజీ కళాక్షేత్రం, జైన్ టెంపుల్, భద్రకాళి బండ్ ను సందర్శించారు. అనంతరం ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణిలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలు కాకతీయులు, కాళోజీ, ఆచార్య జయశంకర్ చరిత్రకు ప్రతిరుపాలని ఆయన అభివర్ణించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మరిని పారద్రోలిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన కొనియాడారు. ఉద్యమాలతో పాటు అభివృద్ధికి ఓరుగల్లు దిక్సూచి గా నిలిచిందన్నారు. పట్టణాభివృద్ధిలో రాష్ట్ర పురపాలక మరియు ఐటీ మంత్రి కేటీఆర్ కు సరిరారు ఎవ్వరు అంటూ ఆయన కితాబిచ్చారు. ప్రపంచ దేశాల నుండి అందుతున్న ఆహ్వానాలు, ప్రశంసలు అందుకు అద్దం పడుతున్నాయన్నారు.