నిర్దేశిత గడువులోపుగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి: మంత్రి వెల్లంపల్లి
- ప్రణాళికాబద్ధకంగా నగర అభివృద్ధికి చర్యలు: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
- క్షేత్ర స్థాయి అధికారులు నిరంతర పర్యవేక్షణలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి: కమిషనర్ రంజిత్ భాషా
అదే విధంగా రూ.75 లక్షల 14వ ఆర్ధిక సంఘ నిధులతో 45వ డివిజనులోని దశరధ టింబర్ డిపో రోడ్డు, ద్వారకా వీధికి సీసీ రోడ్ల నిర్మాణా పనులకు మరియు 46వ డివిజన్ నందు రూ. 35.30 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో డా కేఎల్ రావు పార్క్ నుండి కేటీ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి అతిధులు ఆయా డివిజన్ కార్పోరేటర్లతో కలసి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు విజయవాడ నగరంపై ప్రత్యేక దృష్టి సారించి నగరంలో ఉన్నటువంటి పార్కులను, రోడ్లను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను అభివృద్ధి పరిచేందుకు అవసరమైన నిధులను కేటాయించారన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల కల అయిన భవానీపురం స్టేడియంను కూడా త్వరితగతిన నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గములో చేపట్టిన పనులు అన్నియు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయునట్లుగా చూడాలని అధికారులకు సూచించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధకంగా నగర అభివృద్ధికి చర్యలు చేపట్టి, ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక కార్పొరేటర్ల అభ్యర్ధనల మేరకు అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలో పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నీటి సరఫరాకు సంబందించి పాడైన పాత త్రాగునీటి పైపులైన్ స్థానములో కొత్త పైపులైన్ మార్పు చేయుటకు చర్యలు తీసుకున్నామని అన్నారు.
అదే విధంగా కమిషనర్ రంజిత్ భాషా మాట్లాడుతూ నగరాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయి అధికారులు నిరంతర పర్యవేక్షణలో పనుల యందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చేపట్టిన అన్ని పనులు నిర్దేశిత గడువులోపుగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని అన్నారు.
పై కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు, మైలవరపు మాధురి లావణ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లు డైరెక్టర్ లు మరియు పలువురు అధికారులు సిబ్బంది, స్థానిక పార్టీ నాయకులు రాయన నరేంద్ర పాల్గొన్నారు.