కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుంది: మంత్రి జగదీష్ రెడ్డి
- మిషన్ భగీరథ తో ఫ్లోరోసిస్ మటుమాయం
- ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపే అందుకు కారణం
- అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెడుతోంది
- మునుగోడునియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన
- వినూత్నంగా కళ్యాణాలక్ష్మి చెక్ ల పంపిణీ
- మంత్రి జగదీష్ రెడ్డి వెంట పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నియోజకవర్గ టి ఆర్ యస్ ఇన్చార్జ్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు
అనంతరం జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ తో ఫ్లోరోసిస్ మటుమాయం అయిందన్నారు.దశాబ్దాల తరబడి మునుగోడు నియోజకవర్గన్నీ అతలాకుతలం చేసిన ఫ్లోరోసిస్ ను ప్రారదొలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెడుతుంటే యావత్ భారతదేశం చూపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వైపు మళ్లిందన్నారు. 2014 కు ముందు వెనుక అన్నది ఒక్కసారి మననం లోకి తీసుకుంటే అభివృద్ధి అంటే ఏమిటో అన్నది ప్రతి ఒక్కరికి బోధపడుతుందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ మొదలు రైతు బంధు, రైతు భీమా వంటి విప్లవాత్మకమైన పథకాలతో పాటు ఈ రోజు పంపిణీ చేస్తున్న క్షల్యాణాలక్ష్మి వంటి పథకాలు పురుడు పోసుకున్నాయి అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనానికి గీటు రాయిగా నిలుస్తుందన్నారు.కరువు కటకాలతో అల్లాడి ఫ్లోరోసిస్ తో రోగాల బారిన పడిన మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితులే అభివృద్ధి కి దిక్సూచీలుగా నిలుస్తాయన్నారు.
అనంతరం మునుగోడు మండలం కిస్టాపురం గ్రామ శ్రీశ్రీశ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొని నూతన పాలకవర్గాన్ని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. అదే విదంగా చండూరు మండల కేంద్రంలోనీ శ్రీశ్రీశ్రీ కోటమైసమ్మ దేవాలయ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారు గడ్డలో 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంబెడ్కర్ భవనానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన జరిపారు.అనంతరం అదే నియోజకవర్గ పరిధిలోని నారాయణ పురం మండల కేంద్రంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు నియోజకవర్గ టి ఆర్ యస్ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూరు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న జడ్ పి టి సి లు కర్నాటి వెంకటేశం, రవీందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.