పురుషునితో పాటుగా మహిళలు అన్ని రంగాలలో ముందుండుట ఎంతో గర్వకారణం: విజయవాడ మేయర్
- మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ ప్రజా జీవితంలో రాజకీయంగా మరియు ఉద్యోగులుగా మహిళలు రాణించి ఉన్నతంగా ఎదుగుతున్నారని గుర్తు చేస్తూ, పురుషునితో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ఉండుట మహిళగా ఎంతో గర్వకారణం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహనరెడ్డి కరోన కష్టకాలంలో కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ, అనేక సంక్షేమ పథకములు అమలు చేయుట ద్వారా, మహిళలను ప్రోత్సహిస్తూ 50 శాతం రిజర్వేషన్ విధానమును అమలు చేస్తూ, మహిళలకు అనేక ఉన్నతమైన పదవులను ఇవ్వటం పట్ల ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఎల్.కే.జీ నుండి పీజీ వరకు ఆడపిల్లల చదువు నిమిత్తం అని రకాల సహాయ సహకారం అందించుట మరియు విద్య దీవెన, వసతి దీవెన, ఫీజ్ రియంబెస్మెంట్ వంటి పథకలను ప్రవేశ పెట్టిన ఘనత వై.ఎస్.ఆర్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.
మహిళలకు అన్ని సంక్షేమ పథకాలు అందించిన మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి: ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్
ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనుట ఎంతో సంతోషకరమని, ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని, మహిళలను దృష్టిలో పెట్టుకొని అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చిన మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆడపడుచుల ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
అదే విధంగా ఏ.పి.ఐ.డి.సి. చైర్మన్ బండి పుణ్యశీల, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజ రెడ్డి, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి తదితరులు ప్రశంగిస్తూ, ప్రతి మహిళ విజయం వెనుక పురషులు, పురుషుల వెనుక మహిళ ఉంటుందని, చదువులలో, క్రీడలలో, రాజకీయాలలో, వృతి ఉద్యోగాలలో నేడు మహిళలు అనేక విజయాలు సాదించి ఆదర్శంగా ఉంటున్నారని అన్నారు.
కార్యక్రమములో మహిళా కార్పొరేటర్లు, కో-అపేట్ మెంబెర్లు, అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతభాయి, డి.సి.(ఆర్) వెంకటలక్ష్మి, హెల్త్ ఆఫీసర్, డా.శ్రీదేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, వి.ఏ.ఎస్ డా.రవిచంద్ మరియు మహిళా ఉద్యోగస్తులు పాల్గొన్నారు.