దేశంలో మహిళల కోసం అత్యధిక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలు: మంత్రి సత్యవతి రాథోడ్
- దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలు తెలంగాణలోనే
- మహిళల ఉన్నత విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు
- మహిళల ఆరోగ్యం కోసం న్యూట్రిషియన్ కిట్ ఇస్తున్నందుకు కృతజ్ణతలు
- బాలికల కోసం హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ ఇవ్వడం చారిత్రాత్మకం
- మహిళలను సన్మానించుకోవడం, మహిళా పథకాలను తెలియజేయడం కోసమే మూడు రోజుల వేడుకలు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రి సత్యవతి రాథోడ్ మాటలు:
- సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో అద్భుతమైన పథకాలు అమలు జరుగుతున్నాయి.
- మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒకరోజు సరిపోదు అని మూడు రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం.
- అనేక మందిని ఈ మూడు రోజులుగా అనేక వేదికల్లో సన్మానం చేసుకున్నాం.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు తెలియజెప్పి, వారందరినీ భాగస్వామ్యం చేసేందుకు ఈ మూడు రోజుల వేడుకలు చేశాం.
- మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభచూపిన నేటి అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు.
- నిన్న ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మహిళలు అంతా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపాలి.
- నాడు ఎన్టీఆర్ గారు పద్మావతి విశ్వ విద్యాలయం తీసుకొస్తే... నేడు మళ్లీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడ మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటుపై బడ్జెట్ లో ప్రకటన చేశారు. ఇందుకు మహిళల తరపున నేను సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను.
- గర్భం దాల్చిన ప్రతి మహిళ పోషకాహారం తినాలి అని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య లక్ష్మి పథకం తీసుకొచ్చి, వారికి మంచి ఆహారం ఇస్తున్నాము. ఇందుకు కృషి చేస్తున్న అంగన్వాడిలను అభినందిస్తున్నాను.
- అంగన్వాడీల కష్టం గుర్తించి, సీఎం కేసీఆర్ గారు మూడు సార్లు వేతనాలు పెంచి, పి.ఆర్.సి కూడా ఇచ్చారు. నేడు దేశంలో అధికంగా వేతనాలు తీసుకుంటున్నది మనవారే.
- గతంలో నెలాఖరుకు కూడా అంగన్వాడీలకు జీతాలు రాని పరిస్థితి ఉండేది. ఒకసారి దసరా నాటికి కూడా వేతనాలు రాలేదు అంటే సీఎం కేసీఆర్ గారు అలా జరగకూడదని చెప్పి, వెంటనే 40 కోట్లు వేతనాలకోసం విడుదల చేసి, ఇకపై ప్రతి నెల 5వ వతేదీ దాటకుండా వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు.
- మహిళల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏమి చెయ్యాలో సూచించాలంటూ, 9 మంది ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి, ఇతర రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించారు.
- గర్భిణీ స్త్రీలు, బాలింతలకు భోజనం, పాలు, గుడ్డుతో పాటు కేసీఆర్ కిట్ కింద నెలకు 2వేల రూపాయల చొప్పున 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి, 13 వేల రూపాయలు ఇచ్చి, కిట్ లో బ్రాండెడ్ వస్తువులు అందిస్తున్నారన్నారు. ఈ పథకానికి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
- గిరిజన కుటుంబంలో జరిగిన సంఘటన చూసి చలించిన సీఎం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చారు. ఈ పథకం కింద 10.26 లక్షల మంది లబ్ది పొందారు. దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
- పోషకాహార లోపాన్నిఅధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ కూడా ఇస్తున్నారు.
- 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకం. ఇక మహిళ సీఎంగా ఉన్నా బాలికలు, మహిళల గురించి ఇంత గొప్పగా ఆలోచించలేరు.
- మహిళలకు రక్షణ కవచంగా ఉండేందుకు సఖి కేంద్రాలు, భరోసా కేంద్రాలు మహిళల భద్రత కోసం అమలు చేస్తున్నారు. ఇవి దేశానికి ఇది రోల్ మోడల్.
- భగీరథుని రూపంలో సీఎం కేసీఆర్ గారు ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నారు.
- ఆసరా పెన్షన్ ద్వారా కుటుంబంలోని వృద్ధులకు కూడా సీఎం కేసీఆర్ గారు గౌరవం కల్పించారు. ఇలా అనేక విషయాల్లో చాలా మార్పు తెచ్చారు. పేద వాడికి అండగా...మహిళకు కవచంగా పని చేస్తున్నారు.
- రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్నఇలాంటి ప్రతి పథకం గ్రామీణ ప్రాంతాల్లో మహిళకు కూడా తెలియాలి. అలా మనమంతా కలిసి ప్రచారం చేయాలి.
- సుస్థిరమైన రేపటి కోసం లింగ సమానత్వం రావాలి అంటే మొదట మనలో మార్పు రావాలి, తద్వారా సమాజంలో మార్పు రావాలి.
- నేడు మహిళలో దేనిలో తీసిపోని విధంగా రాణిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం అందిస్తోంది.
- ఇంత పెద్ద హైదరాబాద్ సిటీని ఇద్దరు మహిళలు పాలించే అవకాశం కల్పించిన నాయకులు సీఎం కేసీఆర్ గారు.
- రాష్ట్ర మహిళలకుమ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- జనాభాలో సగ భాగం ఉన్న మహిళలను సన్మానించుకోవడం కోసం మూడు రోజుల వేడుక జరుపుకోవాలి అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ గారు పిలుపునివ్వడంతో చాలామంది మహిళలను సన్మానించుకుంటున్నాం.
- తెలంగాణ రాష్ట్రంలో మా ఆడపడచులు ఖాళీ బిందెలతో నీళ్లకు వెళ్లకుండా... ఇంటింటికీ నల్లా నీళ్ళు ఇస్తున్న అపర భగీరథులు సీఎం కేసీఆర్ గారు.
- ఈ రోజు మహిళా దినోత్సవం వేడుకలో పాలు పంచుకోడం అదృష్టంగా భావిస్తున్నాను.
- మహిళ నేడు పురుషులతో సమానంగా పని చేస్తోంది. ప్రతి మగవాడి విజయం వెనుక మహిళా ఉన్నట్లే ప్రతి మహిళా విజయం వెనుక కూడా పురుషులు ఉంటారు.
- మహిళలు నేడు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో మహిళలను సీఎం కేసీఆర్ గారు పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నారు.
- గతంలో మహిళా దినోత్సవం రోజున సెలవు పెట్టుకుని రావాల్సి వచ్చేది. కానీ సీఎంకేసీఆర్ గారు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును హాలిడేగా ప్రకటించారు. అందుకే మహిళా బంధు అయ్యారు.
- రిజర్వేషన్ల వల్ల నేడు చాలా మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు.
- మహిళలపై హింసకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ తోడుగా ఉంటాం.
- హింస లేని సమాజాన్ని నిర్మిద్దాం. మహిళల అభ్యున్నతికి పాల్పడుదాం.
- కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,116 రూపాయలు ఇస్తున్నారు.
- కేసీఆర్ కిట్ బ్రహ్మాండమైన పథకం.
- ఆరోగ్య లక్ష్మి పథకం అనేది అందరికీ మధ్యాహ్నం మంచి భోజనం అందించే గొప్ప పథకం.
- మహిళలకు మంచి విద్య అందించి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య గురుకులాలు ఏర్పాటు చేశారు.
- ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మహిళల కోసం అమలు చేస్తున్న రాష్ట్రం మనది.
- మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం అండదండలు ఇస్తోంది.
- మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా, సఖీ కేంద్రాలు పెట్టీ చర్యలు తీసుకుంటుంది.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మహిళా మహిళా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస రావు, ప్రభుత్వ సలహాదారు శోభారాణి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, షాద్ నగర్ జడ్పీటీసి రాజమ్మ, స్థానిక కార్పోరేటర్ విజయా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.