మహిళా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు: అల్లం నారాయణ

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణా తరగతులు ఏప్రిల్ మాసంలో హైదరాబాదులో నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. రెండు రోజులపాటు జరిగే శిక్షణా తరగతులలో పాల్గొనదలచినవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. హైదరాబాదులోని మహిళా జర్నలిస్టులు మీడియా అకాడమి మేనేజర్ ఏ.వనజ (సెల్ నె.7702526489)ను మరియు జిల్లాలలో పని చేసేవారు ఆయా జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయాలలో నమోదు చేసుకోవాలని అన్నారు.

మొదటిరోజు రాష్ట్ర మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాసనసభ్యులు ఈ శిక్షణా తరగతుల్లో ప్రసంగిస్తారు. రెండవ రోజు జాతీయ స్తాయిలో నిష్ణాతులైన మహిళా జర్నలిస్టులు ప్రసంగిస్తారు. ఈ శిక్షణా తరగతులలో మొదటి రోజు “మహిళా జర్నలిస్టులు- ప్రధాన స్రవంతి మీడియా - మహిళల పాత్ర” అనే అంశంపై మరియు “ పాత్రికేయ రంగంలో మహిళలు - ప్రత్యేక సమస్యలు” అనే అంశంపై  ప్రసంగాలు వుంటాయి. రెండవరోజు “మహిళా అస్తిత్వం - జెన్డర్ సెన్సీటైజేషన్ “ అనే అంశం, “ఫీచర్ జర్నలిజం - మెళకువలు” అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్ణాతులైన వారి ప్రసంగాలు వుంటాయి.

ఈ తరగతులలో అకాడమీ ప్రచురణలు మహిళా జర్నలిస్టులకు ఇవ్వబడుతాయి.మార్చి 26, 27 తేదిలలొ మీడియా అకాడమి నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు విజయవంతంగా జరిగాయని, దాదాపు 2000 దళిత జర్నలిస్టులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి శ్రద్ధగా తరగతులను విన్నారని ఈ సందర్బముగా చైర్మన్ గుర్తు చేశారు. ఈ సమావెశములో ఎ.వనజ, మేనేజర్ మరియు యం.పుర్ణచందర్ రావు, అక్కౌంట్స్ అధికారి పాల్గోన్నారు.

యువ సైంటిస్ట్ కనిపెట్టిన వాటర్ ఫ్యూరిపైర్ ను ఆవిష్కరించిన అల్లం నారాయణ:
ఫ్లోరైడ్ భూతానికి బలైన నల్లగొండ ప్రాంతం నుండి స్విట్జర్లాండ్ లోని ”స్విస్ ఫెడరల్ యూనివర్సిటీ “ జూరిష్ లో చదివిన యువ సైంటిస్ట్ డా|| శ్రీనివాస్ కనిపెట్టిన వాటర్ ఫ్యూరిపైర్ ను మీడీయా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించారు. ప్రఖ్యాత శాస్త్రవెత్త ఐన్ స్టీన్ చదివిన యూనివర్సిటీలో మన తెలుగు తేజం సీటు సంపాదించిన శ్రీనివాస్ కు గొప్ప భవిష్యత్తు వుందని ఈ సందర్భముగా అన్నారు. 

ప్రస్తుతం వాడుకలో ఆర్.ఓ.ఆర్.లో 50% నీరు వృధా అవుతుందని, నీటిలోని మినరల్స్ పోయి నీరు చచ్చుపడుతుందని యువ శాస్త్రవెత్త అన్నారు. సుప్రీమ్ కోర్ట్ కూడా ఆర్.ఓ.ఆర్. వాడకం ప్రతిబందించిందని అన్నారు. హైదరాబాదు లోని ఎన్.జీ.ఆర్.ఐ పరిశోధానా సంస్థ ఈ పరికరాన్ని పరిశీలించి దీని నుండి వచ్చే నీరు స్వచ్చమైనదని తెలిపిందని, ఆ సంస్థ సైంటిస్ట్ డా|| రామ్మోహన్ చెప్తూ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి కూడా వుందని తెలిపారు.

More Press Releases