డ‌యాల‌సిస్ ధ‌ర‌ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించిన సెంచురీ ఆస్ప‌త్రి, సెష‌న్‌కు రూ.1400 మాత్ర‌మే

Related image

-    మ‌ల్టీస్పెషాల్టీ ఆస్ప‌త్రుల్లో ఇదే అతిత‌క్కువ ధ‌ర‌, త‌ర‌చు డ‌యాల‌సిస్ అవ‌స‌ర‌మైన వంద‌లాది మంది రోగుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రం
-    ఆస్ప‌త్రి నంబ‌రు 040-67833333కు ఫోన్ చేసి ఈ రాయితీ ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు

హైద‌రాబాద్, మే 5th, 2022: న‌గ‌రంలోని ప్ర‌ధాన మ‌ల్టీస్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన సెంచురీ ఆస్ప‌త్రి డ‌యాల‌సిస్ ధ‌ర‌ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించింది. సెష‌న్‌కు కేవ‌లం రూ.1400 మాత్ర‌మే తీసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చాలావ‌ర‌కు కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో ఇది రూ.3వేలకు పైగా ఉంది. న‌గ‌రంలోని మ‌ల్టీస్పెషాలిటీ ఆస్ప‌త్రుల్లో ఇదే అతిత‌క్కువ ధ‌ర కావ‌డంతో త‌ర‌చు డ‌యాల‌సిస్ అవ‌స‌ర‌మ‌య్యే వంద‌లాది మంది రోగుల‌కు ఇది చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. రోగులు ఆస్ప‌త్రి నంబ‌రు 040-67833333కు ఫోన్ చేసి ఈ రాయితీ ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

మూత్రపిండాలు త‌మ ప‌ని సహజంగా చేయ‌లేన‌ప్పుడు రక్తం నుంచి అదనపు నీరు, ద్ర‌వాలు, విష‌పూరిత ప‌దార్థాల‌ను తొలగించడానికి డయాలసిస్ సహాయపడుతుంది. మూత్రపిండాల మార్పిడి చికిత్స అని పిలిచే ఈ ప్రక్రియ, అంత్య‌దశ మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి తప్పనిసరి. అన్ని సంద‌ర్భాల్లో మూత్ర‌పిండాల మార్పిడి నేరుగా సాధ్యం కాదు. అందువ‌ల్ల దాత‌లు దొరికేవ‌ర‌కూ లేదా రోగి ఆరోగ్యం మూత్ర‌పిండాల మార్పిడికి అనువుగా మారేవ‌ర‌కూ డ‌యాల‌సిస్ చేయాల్సి ఉంటుంది.

ఈ సంద‌ర్భంగా సెంచురీ ఆస్ప‌త్రి సీఈవో డాక్ట‌ర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, “మూత్ర‌పిండాల రోగుల‌కు డ‌యాల‌సిస్ దీర్ఘ‌కాలం పాటు అవ‌స‌రం అవుతుంది. దీనివ‌ల్ల కుటుంబాల ఆర్థిక ప‌రిస్థితిపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. మూత్ర‌పిండాల రోగులు రోజూ ప్రాణాల కోసం పోరాడుతారు. అందువ‌ల్ల అత్యంత ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో డ‌యాల‌సిస్ చేయ‌డం చాలా ముఖ్యం. మూత్ర‌పిండాల రోగులు, వారి కుటుంబ‌స‌భ్యుల ప‌ట్ల మాన‌వ‌త్వంతో సెంచురీ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం డ‌యాల‌సిస్ ధ‌ర‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించాల‌ని నిర్ణ‌యించింది. ఇది అవ‌స‌రంలో ఉన్న‌వారికి ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ఆర్థిక వెసులుబాటును ఇస్తుంది” అని తెలిపారు.

న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న సెంచురీ ఆస్ప‌త్రిలో అత్యుత్త‌మ స‌దుపాయాలున్నాయి. సుల‌భంగా అందుబాటులో ఉండ‌టంతో ఆస్ప‌త్రికి చేరుకోడానికి స‌మ‌యం ఆదా అవుతుంది. ఫ‌లితంగా చికిత్సకు త‌గిన స‌మ‌యం దొరుకుతుంది. బ‌య‌టి కాలుష్యం, ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప్ర‌భావాలు త‌గ్గుతాయి. నాణ్య‌మైన డ‌యాల‌సిస్ చికిత్స‌, నిపుణులైన వైద్య‌బృందం, ఆహార‌స‌ల‌హాలు ఇచ్చేందుకు కౌన్సెలింగ్‌, డ‌యాల‌సిస్ రోగుల సంర‌క్ష‌ణ‌, ఇత‌ర ఉత్త‌మ ల‌క్ష‌ణాల‌న్నీ సెంచురీ ఆస్ప‌త్రి నెఫ్రాల‌జీ బృందంలో ఉన్నాయి. దాంతో ఈ రంగంలో ఈ ఆస్ప‌త్రి అత్యుత్త‌మంగా నిలిచింది.

సెంచురీ ఆస్ప‌త్రి గురించి: 
హైద‌రాబాద్ న‌డిబొడ్డున 220 ప‌డ‌క‌ల‌తో అత్యాధునిక సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిగా సెంచురీ ఆస్ప‌త్రి ఏర్పాటైంది. అగ్నిమాప‌క మార్గ‌ద‌ర్శ‌కాలు, ఎన్ఏబీహెచ్ ప్ర‌మాణాల ప్ర‌కారం నిర్మిత‌మైన ఏకైక ఆస్ప‌త్రి ఇదే. సెంచురీ ఆస్ప‌త్రి బృందంలో వైద్య‌నిపుణులు, న‌ర్సులు, ఫార్మ‌సిస్టులు, ఫిజియోథెర‌పిస్టులు, సోష‌ల్ వ‌ర్క‌ర్లు, వ‌లంటీర్ సేవ‌లు, స‌హాయ సిబ్బంది, వృద్ధుల చికిత్స నిపుణులు ఇలా ఎంద‌రో ఉన్నారు.


More Press Releases