Talasani Srinivas Yadav, Minister for Animal Husbandry participated in the Mana Basthi – Mana Badi programs
పత్రికాప్రకటన
09.05.2022
ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయి అభివృద్ధి చేసి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో మన బస్తి - మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యా దవ్ వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలలో మన బస్తి - మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్యా దవ్ స్థానిక MLA దానం నాగేందర్, DEO రోహిణి, ప్రధానోపాధ్యాయురాలు కరుణా శ్రీలతో కలిసి ప్రారంభించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట డివిజన్ లో గల ధరంకరం రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో MLC వాణీదేవి, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారిలతో కలిసి మంత్రి తలసాని పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అందులో భాగంగా మన బస్తీ -మన బడి క్రింద రాష్ట్రంలో 26,065 పాఠశాలల అభివృద్ధికి 7259 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని, మొదటి విడతలో 9123 పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టడం కోసం ప్రభుత్వం 3497 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. మూడు విడతలలో అన్ని పాఠశాలలను ఈ కార్యక్రమం క్రింద పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం క్రింద ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయుట, పాఠశాల భవనాలకు కలర్స్వే యడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ నిర్మించడం వంటి మౌలిక సౌకర్యాలు, వసతులను కల్పించడం వంటి పనులు చేపడతారని వివరించారు. మన బడి మన బస్తి కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి
చేయడంతో పాటు విద్యార్ధులకు మరింత నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనేక మంది తల్లిదండ్రులకు తమ పిల్లలను మంచి విద్యావంతులను చేయాలని ఆశయం ఉన్నప్పటికీ వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్ధుల సంఖ్య రెట్టింపు కానున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
ముషీరాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో మన బస్తీ -మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్స్థా నిక MLA ముఠా గోపాల్, MLC సురభి వాణి దేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నదని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ యాదవ్ ను పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరగా, ప్రతిపాదనలను సిద్దం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
భారతదేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమం....మంత్రి తలసాని
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం కోసం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మన బస్తీ మన బడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు. అంబర్ పేట లోని పోలీస్ గ్రౌండ్ లోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను స్థానిక MLA కాలేరు వెంకటేష్, MLC సురభి వాణి దేవి, DEO రోహిణి, కార్పొరేటర్ విజయ్ కుమార్, BC కమీషన సభ్యులు కిషోర్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీలు ఇచ్చారు కానీ ఆచరణలో అమలు చేయలేకపోయారని అన్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఉచితంగా విద్యను అందించడంతో పాటు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న బోజన సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పాఠశాల విద్యార్ధుల సౌకర్యార్ధం, అభివృద్ధి కోసం పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని కేటాయించాలని, రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని MLA కాలేరు వెంకటేష్ కోరగా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.