సర్ విజ్జి స్విమ్మింగ్ ఫూల్ పనులను పరిశీలించిన వీఎంసీ కమిషనర్

Related image

  • అధికారులకు ఆదేశాలు
  • యుద్దప్రాతిపదికన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి  
విజయవాడ: నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం అధికారులతో కలసి గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ ఫూల్ లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల యొక్క పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్ నందు చేపట్టిన పనుల వివరాలు అడిగితెలుసుకొని, చేపట్టిన ఇంజనీరింగ్ పనులతో పాటుగా గ్రీనరి పనులు అన్నియు వేగవంతము చేసి యుద్దప్రాతిపధిక పూర్తి చేసి మూడు రోజులలో స్విమ్మింగ్ ఫూల్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

తదుపరి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ఆవరణలో గల కుక్కల ఆపరేషన్ యూనిట్ నందు వీధి కుక్కలకు ఆపరేషన్ చేయు ప్రక్రియను పరిశీలించి నగరంలో కుక్కల నియంత్రణ ఆపరేషన్లను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయాలని, ఆపరేషన్ల నిర్వహణలో పూర్తి జాగ్రతలు తీసుకోనవలేనని అన్నారు.

నగరంలో గల వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఆపరేషన్ నిర్వహించుటతో పాటుగా వాటికీ యాంటి రైబిస్ వ్యాక్సిన్ తప్పక ఇవ్వవలెనని, వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని కుక్కల ఆపరేషన్ యూనిట్ నందు పశువైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంలో ఎక్సెల్ ప్లాంట్ చుట్టు కొంత మేర ప్రహరి గోడ లేకపోవుట గమనించి పూర్తి స్థాయిలో గోడ నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అనంతరం మధురానగర్ నందలి ఆర్.యు.బి పనులను పర్యవేక్షించి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనులు వేగవంతముగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, వి.శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases