రెండు నూతన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన గూగుల్!
- పిక్సల్ 4, పిక్సల్ 4 ఎక్స్ఎల్ విడుదల
- భారత్ లో మాత్రం విడుదల చేయడం లేదని వెల్లడి
- ఈ ఫోన్ లు అధునాతన ఫ్రీక్వెన్సీని కలిగి ఉండటమే కారణంగా భావిస్తున్న మార్కెట్ వర్గాలు
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలే తన నూతన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. పిక్సల్ 4, పిక్సల్ 4 ఎక్స్ఎల్ పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లలో డిస్ప్లేలు 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్నాయి. పిక్సల్ 4 లో 5.7" డిస్ప్లేను ఏర్పాటు చేయగా, పిక్సల్ 4ఎక్స్ఎల్ లో 6.3"డిస్ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లాంటి ఫీచర్ లు కలిగిన ఈ ఫోన్లలో ఇంకా చాలా రకాల ఫీచర్లను కలిగి ఉన్నాయి.
అయితే, పిక్సల్ 4 ఫోన్ లను భారత్ లో మాత్రం విడుదల చేయడం లేదని గూగుల్ ప్రకటించింది. ఈ ఫోన్ లలో ప్రత్యేకంగా ఉపయోగించిన రేడార్ సెన్సార్ ఫీచరే దీనికి గల కారణంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రేడార్ సెన్సార్ టెక్నాలజీ 60గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీలో పని చేస్తుంది. సాధారణ ప్రజలు ఈ ఫ్రీక్వెన్సీని వాడకంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఫ్రీక్వెన్సీని మనదేశంలో కేవలం మిలిటరీ, ప్రభుత్వ పథకాలలోమాత్రమే వాడుతున్నారు.
ఇతర ఫీచర్లు:
- ఆండ్రాయిడ్ 10ఓఎస్, 12.2, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
- పిక్సల్ 4 - 2800 ఎంఏహెచ్ బ్యాటరీ
- పిక్సల్ 4ఎక్స్ఎల్ - 3700 ఎంఏహెచ్ బ్యాటరీ