తెలంగాణ రాష్ట్రానికి జయశంకర్ సార్ ఐకాన్: మంత్రి జగదీష్ రెడ్డి
- తెలంగాణ ఏర్పాటుకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు
- ఆయన ఆశయసిద్ధికి అనుగుణంగా కేసీఆర్ పాలన
- సూర్యపేటలో ఘనంగా దివంగత ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి
- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆంద్రప్రదేశ్ లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని ఆయన తెలిపారు. అటువంటి మహానుబావుడి సంకల్పసిద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారన్నారు.ఈ రోజున సార్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాను కన్న కలలు సాకారం అవుతున్నందుకు ఎంతగానే సంబురపడేవారని ఆయన చెప్పారు. తెలంగాణ వెనుకబాటుకు గురైన ప్రాంతం కాదని వెనుకబాటుకు నెత్తివేయబడిన ప్రాంతమంటూ వేల సభలలో జయశంకర్ సార్ చేసిన ఉపన్యాసాలను మంత్రి జగదీష్ రెడ్డి గుర్తుచేశారు.
అటువంటి సహజ వనరులను సద్వినియోగ పరుచుకొని ఎనిమిదేండ్ల పాలనలో యావత్ భారతదేశంలోనే తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో నిలబెట్టారన్నారు. అద్భుతమైన విజన్, అంతకుమించి చక్కటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోటే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాదించిందన్నారు. ఇది ఎవరో చెబితే తెలిసింది కాదని ఎనిమిదేండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు స్వయానా కేంద్ర ప్రభుత్వమే కితాబునివ్వడం ఇందుకు అద్దం పడుతుందన్నారు.
కేంద్రప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి చెందిన గ్రామాల లిస్ట్ లో ఒకటి నుండి పందొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్ర పల్లెలు ఉండడం పట్టణాల వారుసలోను ఒకటి నుండి పది వరకు కేంద్రప్రభుత్వ లిస్ట్ లో ముందుండడమే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు తార్కాణంగా మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు. అంతకు మించి వేగవంతమైన వ్యవసాయ అభివృద్ధి, విద్యుత్ రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలతో పాటు పారిశ్రామిక రంగంలో కొత్తగా ప్రకటించిన పాలసీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది అంటే జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పాలనకు నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.