సైకిల్ ట్రాక్ లను ప్రజలు వినియోగించుకోవాలి: మల్లాది విష్ణు

Related image

విజయవాడ: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాని తగ్గించే క్రమములో విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయట అభినందనీయమని, ప్రజలు సైక్లింగ్ పై మక్కువ చూపించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా శనివారం విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో యం.జీ రోడ్, హోటల్ లెమన్ ట్రీ నుండి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నందు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజారెడ్డి, వై.సి.పి నాయుకులు దేవినేని అవినాష్ మరియు పలువురు కార్పొరేటర్లు పాల్గొని స్వయంగా సైకిల్ తొక్కి ప్రజలకు అవగాహన కల్పించారు.

సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో దోహదకారిగా ఉంటుంది – జిల్లా కలెక్టర్

నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా నగరంలో సైకిల్ మరియు ఎలెక్ట్రానిక్ వాహనముల వినియోగం పెంచుటకు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లుతున్నారని, దానిలో భాగమే సైక్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించు అభినందనీయమని అన్నారు. మారుతున్న జీవన శైలిలో ఆరోగ్యం, వ్యాయామానికి ప్రజలు ప్రాదాన్యత ఇస్తూన్న తరుణంలో సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

యూరోపియన్ దేశాల మాదిరిగా మన నగరంలో కూడా సైకిల్ వాడకం పెరగాలని, కేవలం జిమ్ లలో ఇన్ డోర్ సైక్లింగ్ నిర్వహిస్తున్నారని, ప్రకృతి వాతావరణంలో కనీసం అర్ధ గంట అయిన సైక్లింగ్ నిర్వహించుట ద్వారా అధిక మొత్తం అవసరమైన క్యాలరీలను పెంచుకోవటానికి అవకాశం ఉంటుందని ప్రజలు సైకిల్ వినియోగాని పెంచాలని అన్నారు.

సైకిల్ వినియోగంలో ప్రజలు ముందుకు రావాలి, పలు ప్రదేశాలలో ట్రాక్స్ ఏర్పాటుకు చర్యలు: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీస్ వారి సహకారంతో నగరంలో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ సైకిల్ ట్రాక్ ఏర్పాటులో సైకిల్ క్లబ్ వారు ఏమైనా సూచనలు లేదా సలహాలు అందించిన యెడల వాటిని పరిగణలోనికి తీసుకొని ట్రాక్స్ అభివృద్ధి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఈ ట్రాక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రజలు అధిక శాతంలో సైక్లింగ్ నిర్వహించుటకు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్ లను ప్రజలు వినియోగించుకోవాలి: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యలు మల్లాది విష్ణు

నగరంలో కాలుష్యాన్ని నివారించుటతో పాటుగా ప్రజలలో సైకిల్ వాడకాన్ని పెంచాలనే లక్ష్యంగా నేడు ఈ సైకిల్ ర్యాలి నిర్వహించుట జరిగిందని, ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించి నగరంలోని అనేక ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్ వంటి వాటిని ఏర్పాటు చేయుట జరుగుతుందని, వాటితో పాటుగా సైకిల్ ప్రేమికులకు అందుబాటులో ఉండేలా సైకిల్ ట్రాక్ లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమములో అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల మరియు ఇతర అధికారులతో పాటుగా సైకిల్ క్లబ్ ప్రతినిధులు మరియు నగర ప్రజలు, నగరపాలక సంస్థ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  

More Press Releases