మహిళలకు వరం స్త్రీ నిధి
- మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా సాధికారతే ఆశయంగా స్త్రీ నిధి పనిచేస్తున్నది
- మహిళ ఆత్మగౌరవం పెరిగేల స్త్రీ నిధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించ బడుతున్నాయి
- ఒక్కొ మహిళకు తమ ఇంటి వద్ద ఉండి పనిచేసుకొనే విధంగా 5 వేల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డికే స్త్రీ నిధి ద్వారా రుణాలు అందచేయ బడుతున్నాయి
- స్త్రీ నిధి ద్వారా తెలంగాణ వచ్చే నాటికి 2014`2015 ఆర్థిక సంవత్సరంలో కేవలం 703 కోట్ల రూపాయలు రుణం మాత్రమే అందించగా, 2021`2022 సంవత్సరంలో 3074 3 వేల కోట్ల రూపాయలను అందించడం జరిగింది
- రాష్ట్రంలో 8 ఏళ్ళలో స్త్రీ నిధి ద్వారా 14 వేల 765 కోట్ల 86 లక్షల రూపాయలు మహిళ స్వయం సహాయక సంఘాలకు పంపిణి
- రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి ద్వారా 3700 కోట్ల రూపాయలను రుణంగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది
స్త్రీ నిధి
----------
మహిళా సంఘాల సభ్యులు అందరూ జీవనోపాదుల ద్వారా ఆదాయం పెంపొందించడం, అన్ని రకాల అవసరాలకు సత్వర రుణం పొందుటకు సత్వర రుణ సహకారం ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి సంస్థను స్థాపించింది. స్త్రీ నిధి సంస్థలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మంది సభ్యులు ఉన్నారు 5 లక్షల 50 వేల సంఘాలు, 22 వేల 300 గ్రామ సమాఖ్యలు, 629 మండల పట్టణ సమాఖ్యలు భాగస్వామ్యం ఉన్న ఏకైక సంస్థ స్త్రీ నిధి. మన రాష్ట్రంలో శ్రీనిధి సంఘాలను చూసి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి లాంటి సంస్థను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
స్త్రీ నిధిప్రత్యేకలు
----------------------
మన దేశంలో ఈ విధమైన సంస్థ ఎక్కడా లేదు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించడానికి ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. మహిళలు తమ ఇంటి వద్ద ఉండి పని చేసుకునే విధంగా అతి తక్కువ వడ్డీకే (11.5 శాతం) రుణాలు స్త్రీ నిధి ద్వారా నేరుగా అందించబడుతుంది. పాడి పశువులు, కోళ్ళ పెంపకం, ఎలక్ట్రిక్ ఆటోలు, చిన్న చిన్న షాపులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించబడుతున్నది. ఒక్కో మహిళకు తమ ఇంటి వద్ద ఉండి పని చేసుకొనే విధంగా 5 వేల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించబడుతున్నాయి. మహిళల నుండి తీసుకునే వడ్డీ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కన్నా 3 శాతం తక్కువ. స్త్రీ నిధిలో అప్పు పొందుటకు ఏవిధమైన ఖర్చులు, సేవా రుసుములు ఉండవు. వడ్డీ మార్టిన్, స్త్రీ నిధి పొందుపులపై ఇచ్చే వడ్డీ వల్ల స్త్రీ నిధి నుండి వచ్చే డివిడెండ్ వలన మహిళా సమైక్య సంఘాలు లబ్ధి పొందుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళ కాలంలో ( 2014`15 నుండి 2021`2022) వరకు స్త్రీ నిధి సాధించిన ప్రగతి.
1)క్రమ సంఖ్య ఆర్థిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ లక్ష్యం లక్ష్యసాధన సభ్యులు
(రూ. కోట్లలో) (రూ. కోట్లలో)
(1)2014`15 : 750కోట్లు , : 703.05 కోట్లు, :3,36,631మంది సభ్యులు.
(2)2015-16 :రూ.950కోట్లు , :రూ.1148.37కోట్లు & 4,55,189 మంది సభ్యులు.
(3)2016-17 , రూ.1450కోట్లు, రూ 1354.6 కోట్లు & 4,38,941 మంది సభ్యులు.
(4)2017-18, రూ.1810కోట్లు, రూ 1838.37 కోట్లు, & 6,37,213 మంది సభ్యులు.
(5)2018-19, రూ.2300కోట్లు, రూ2320.1 కోట్లు, & 7,01,264 మంది సభ్యులు.
(6)2019-20, రూ.2900 కోట్లు, రూ.1937.48కోట్లు & 4,63,224 మంది సభ్యులు.
(7)2020-21, రూ.2375 కోట్లు, రూ.2381.51కోట్లు & 5,35,943 మంది సభ్యులు.
(8)2021-22 , రూ.3060 కోట్లు, రూ.3074.02కోట్లు & 5,00,887 మంది సభ్యులు.
గత ఎనిమిదేళ్ళ కాలంలో స్త్రీ నిధి ద్వారా 14,756 కోట్ల 85 లక్షల రూపాయలను మహిళా సంఘాల సభ్యులకు రుణంగా అందించడం జరిగింది. కిరాణం, లాండ్రీ, మొబైల్ ఫోన్ రిపేరింగ్, పౌల్ట్రీ, బేకరీ షాప్, గాజుల దుకాణం, సెలూన్, బ్యూటీ పార్లర్, ఇటుకల తయారీ, ఫోటో స్టూడియో, కార్పెంటరీ, సెంట్రింగ్, ఇంటర్నెట్, పాడి పరిశ్రమ, డెకరేషన్ అండ్ లైటింగ్ సర్వీస్, ఫ్యాన్సీ స్టోర్స్, చేపల అమ్మకం, పేపర్ ప్లేట్లు తయారీ, గొర్రెల పెంపకం, టైలరింగ్ షాపు, కూరగాయల అమ్మకం, వెల్డింగ్, జిరాక్స్ లాంటి 65 రకాల యూనిట్లు ప్రారంభించడానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించడం జరిగింది.
2022-23 స్త్రీ నిది వార్షిక ప్రణాళిక
2022-23 ఆర్ధిక సంవత్సరంలో 3700 కోట్ల రూపాయలను స్త్రీ నిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణంగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించబడిరది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 626 కోట్ల రూపాయలు అధికంగా రుణాలను ఇచ్చి సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుంది.
2021-2022 ఆర్థిక సంవత్సరంలో 750 కోట్ల రూపాయలను ఎస్సీ ఉప ప్రణాళిక క్రింద & 410 కోట్ల రూపాయలును ఎస్టీ ఉప ప్రణాళిక క్రింద, స్త్రీ నిధి ఉపప్రణాళిక క్రింద 40 కోట్ల 4 లక్షల రూపాయలను వర్గాల ప్రత్యేక ప్రణాళిక కింద కేటాయించడం జరిగింది. డైరీ, పౌల్ట్రీ యూనిట్ల ఏర్పాటకు, ఎలక్ట్రిక్ ఆటోలకు, ఫుడ్ ప్రొసెడిరగ్ యూనిట్లు, గ్రీన్ హౌజ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల ఏర్పాట్లకు, ద్విచక్ర వాహణాల రిపేర్లకు, జనరల్ మెడికల్ స్టోర్స్, సోలార్ యూనిట్ల ఏర్పాట్లకు ఈ ఆర్థిక సహాయం అందించబడుతుంది. పట్టణ ప్రాతంలో ఉన్న వీధి వ్యాపారుల స్వయం ఉపాధి కోసం రుణం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది.
స్త్రీ నిధి వలన కలిగిన లాభాలు
2014-15 నుండి 2019-20 వరకు 2,020 కోట్ల 47 లక్షల రూపాయలను లాభoగా పొందింది. సంఘ సభ్యుల సంక్షేమానికి వచ్చే లాభాలలో 45 శాతం సంఘాల సామార్ధ్యాన్ని పెంపొందించుటకు, 2 శాతం స్కాలర్‌షిప్‌లుగా అందించబడుతున్నది. ఇంటర్మీడియట్ చదివే సంఘం సభ్యుల పిల్లలకు 2500 రూపాయలు స్కాలర్‌షిప్ అందించబడుతుంది. సురక్ష భీమా పథకం క్రింద స్త్రీనిధిలో రుణం పొందిన వారు వారి సంఘాల లబ్ధి పొందుతున్నాయి. సురక్ష పథకం క్రింద స్వయం సహాయక సభ్యులందరికీ ఒక లక్ష వరకు జీవిత భీమా పథకం అమలు చేయబడుతున్నది.
స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేయబడిన మహిళ సంఘాల బలోపేతంలో భాగంగ 4 కోట్ల 31 లక్షల రూపాయల విలువైన 632 కంప్యూటర్లు , యు.పి.ఎస్.లను, ప్రింటర్లను మండల, పట్టణ సభ్యులకు పంపిణీ చేయడం జరిగింది. స్త్రీ నిధికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. మహిళా సంఘలను అభివృద్ధి దిశగా దూసుకుపోయే ఆలోచనలో ముఖ్యమంత్రి శ్రీ. కె. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు.సంఘాలు ద్వారా ఏ వస్తువు కొన్నను నాణ్యతతో ఉంటుందని ప్రజలలో నమ్మకం కలిగింది. మహిళా సహయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదిగారు- ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి.