ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుట ప్రతి ఒక్కరి బాధ్యత: విజయవాడ మేయర్
- నగరపాలక సంస్థ సిబ్బందితో కలసి ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞా
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్చ్ సర్వేక్షణ్ నందు జాతీయ స్థాయిలో మన నగరం 3వ స్థానములో ఉండుట మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. రాబోవు రోజులలో ఇదే స్పూర్తితో మొదటి స్థానం సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన ఆవశ్యకత మనందరిపై ఉందని అన్నారు. అధికారులు, సిబ్బంది కృషి, ప్రజల సహకారంతోనే ర్యాంక్ సాధించుట జరిగిందని, ఇటివల కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రలో ఇతర నగరాలు కూడా మనం 3 స్థానం సాధించుట పట్ల అభినందనలు కూడా వచ్చాయని వివరించారు. అతి చిన్న నగరం అయినప్పటికీ మనం చేపట్టిన సంస్కరణ వల్ల మిగిలిన రాష్ట్రాలతో పోటి పడి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుట జరిగిందని, దానిని నిలుపుకొనుట మనందరి ప్రధమ కర్తవ్యంగా భావించి నేడు చేపట్టిన ఈ ప్లాస్టిక్ నివారణ చర్యలు మీరందరూ భాగస్వాములై మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు మరియు తోటి స్నేహితులు మరియు చుట్టూ ప్రక్కల నివాసాల వారికీ ప్లాస్టిక్ వాడకం వల్ల కలుగు అనర్ధములు వివరించి వారిలో చైత్యనం నింపి పూర్తి స్థాయిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణను ప్రజలందరూ విధిగా అమలు చేసే విధంగా చూడాలని అన్నారు.
అదే విధంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్త్పతులను నిషేధించాలని అన్నారు. ముందుగా మనం పాటిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో నేడు ఈ కార్యక్రమము చేపట్టినట్లు, రేపటి నుండి మన కార్యాలయంలో ముందుగా పూర్తి స్థాయిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయుట జరుగుతుందని పేర్కొన్నారు. అందరికి తెలిసిన విషయం మన నగరం జాతీయ స్థాయిలో స్వచ్చ్ సర్వేక్షణ్ నందు 3వ స్థానంలో ఉన్నాం, ఆ స్థానాన్ని నిలపెట్టుకోవలననిన లేదా మొదటి లేదా రెండోవ స్థానం కైవసం చేసుకోవాలన ప్రతి ఒక్కరం భాద్యతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేదించి వాటికీ బదులుగా జ్యూట్, క్లాత్ వంటి సంచుల వాడకం మరియు మన ఇంటి, నగర పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటి అంశాలను విధిగా పాటించి నగరంలో పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరు పూర్తి భాద్యత చేపట్టాలని అన్నారు. దీని ద్వారా ప్రజలలో కూడా చైత్యనం వస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ రహిత గణేష్ ఉత్సవాలు నిర్వహించుకొనేలా ప్రజలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయముతో పాటుగా మూడు సర్కిల్ కార్యాలయాలలో మరియు సచివలయాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు మరియు అందరు సిబ్బంది వారి వారి కార్యాలయాలలో ప్రతిజ్ఞా నిర్వహించుట జరిగింది. కళాజాతర బృందం ద్వారా ప్లాస్టిక్ వాడకం వల్ల కలుగు ఇబ్బందులు, పరిసరాల శుభ్రత తదితర అంశాలపై నృత్యగేయాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించట మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులు ఏవి వాడకూడదు, వాటి స్థానంలో వేటిని వినియోగించాలి అవగాహన కలిగే విధంగా పలు ఉత్త్పతులను ప్రదర్శనగా ఏర్పాటు చేసారు.
కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ మరియు ఇతర అధికారులతో పాటుగా అన్ని విభాగములలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పాల్గొని ప్రతిజ్ఞా చేసారు.
స్పందన కార్యక్రమములో 14 అర్జీలు:
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిర్వహించిన స్పందనలో ప్రజల నుండి 14 అర్జీలు స్వీకరించారు. ప్రజల అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక – 7, ఇంజనీరింగ్ – 4, రెవిన్యూ – 2, యు.సి.డి – 1 అర్జీలు వచ్చినవి.
Sl.No | NAME OF THE PETITIONER, ADDRESS | PHONE NUMBER | SUBJECT | DEPARTMENT |
1 | V.JOSHI, 54-13/3-6/1, SRINIVASA NAGAR BANK COLONY. | 9492234488 | REQUEST TO PROVIDE ROAD. | CE |
2 | P.VENKATA SESHAGIRI RAO 27-37-81, PALAPARTHIVARI STREET, GOVERNERPET. | 9246775839 | REQUEST TO REDUCE THE HOUSE TAX | DC R |
3 | SD.AZHARUDDIN, 75-11-31B,BHAVANI PURAM | 9866885789 | REQUEST TO REMOVAL OF 14% OPEN SPACE CHARGES. | CP |
4 | G.PEDA DURGA RAO, 28-12-5, ARUNDAL PET. | 9032400524 | COMPLIENT AGAINST NEIGHBOURS OLD BUILDING. | CP |
5 | M.PRADEEP, 24-1-64, BAVAJIPET. | 8639838844 | REQUEST FOR REMOVAL OF UNAUTHORISED CONSTRUCTION | CP |
6 | R.VENKATA CHINNABABU | 9912280445 | REQUEST FOR ROAD REPAIRS | CE |
7 | B.SIVA PRASAD, 12-13-08 | 9010058884 | REQUEST FOR ROAD REPAIRS | CE |
8 | K.KAMI REDDY, 41-26-1/7A, KRISHNA LANA. | 9849509715 | REQUEST TO PROVIDE SIDE DRAINS. | CE |
9 | T.PRASAD, 41-29/6-1, RANIGARI THOTA | 9393938333 | ROAD OCCUPATION ON SUBBARAJU NAGAR. | CP |
10 | P.VIJAY ANAND, 7-11-34, WYNCHPET | 8520997776 | REQUEST FOR HOUSE TAX PAY PERTICULARS WITH ASSE. NAME | DCR |
11 | K.SRIVANI, 43-140-25/A, PAIPULA ROAD. | 9848113222 | COMPLIENT AGAINST UNAUTHORISED CONSTRUCTION | CP |
12 | R.SITA RAMULU, 9-34-6, | 9392962084 | COMPLIENT AGAINST TO NEIGHBOURS ,DRINAGE PROBLEM | CP |
13 | K.MANIKYAM, A BLOCK -24. | 9700640596 | NAME CORRECTION IN HOUSE ALLOTED PATTA. | CP |
14 | J.LAKSHMI BHAVANI, 4-27-26, CHITTINAGAR. | 9666732358 | COMPLIENT AGAINST 50TH DIVISION RP | PO(UCD) |
కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 8 అర్జీలు
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 పరిధిలో పట్టణ ప్రణాళిక-1, రెవిన్యూ-2, ఇంజనీరింగ్-1, సర్కిల్ – 2 పట్టణ ప్రణాళిక-1, రెవిన్యూ-1 మరియు సర్కిల్ – 3 నందు ర్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1 పట్టణ ప్రణాళిక విభాగం – 1 అర్జీలు మరియు ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేశారు.